టాలీవుడ్ లో మరో ప్రేమ జంట ఒకటైంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎప్పటినుంచో ప్రేమించుకోగా, ఈ కుటుంబాల పెద్దల అంగీకారంతో నవంబర్ 2న ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. అతి తక్కువ బంధుమిత్రుల సమక్షంలో ఇటలీ లో ఘనంగా జరిగిన వీరి పెళ్లి హిందూ సంప్రదాయంలో జరిగింది. ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవ్వగా స్పెషల్ అట్రాక్షన్ గా మెగా అన్నదమ్ములు నిలిచారు. చాలా ఏళ్ల తర్వాత మెగా ఫ్యామిలీ ఈ పెళ్లి వేడుక ద్వారా నిండుగా కనిపించిందని మెగా ఫ్యాన్స్ చాలా సంతోషపడ్డారు. అయితే ఇదే వెడ్డింగ్ లో ఓ ఇద్దరు ఉండడం ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. వాళ్లకే కాదు ఓరకంగా మెగా ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదని టాక్ వచ్చింది.
అయితే వేడుకకి ఇండస్ట్రీ నుంచి పెద్దగా ప్రముఖులు ఎవ్వరూ వెళ్ళలేదు. మరీ మెగా ఫ్యాన్స్ కి కూడా నచ్చని వారు ఎవరై ఉంటారు అని డిస్కషన్ చేస్తుంటే.. సోషల్ మీడియాలో రివీల్ అయింది. మెగా ఫాన్స్ కి నచ్చని ఆ ఇద్దరూ మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్లే కావడం ఆసక్తిగా మారింది. ఆ ఇద్దరూ ఎవరో కాదు చిరు చిన్న కూతురు శ్రీజ, అలాగే నాగబాబు కూతురు నిహారిక. కొన్నేళ్ల కిందట చిరంజీవి ఫ్యామిలీ నుండి విడిపోయి వేరే అతన్ని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ అప్పట్లో ఫ్యామిలీకి అగైనిస్ట్ గా వెళ్లి పరువు తీసింది. తిరిగి మొదటి భర్త నుండి విభేదాల కారణంగా విడిపోయి మళ్ళీ తండ్రి గూటికి చేరింది. తండ్రి ప్రేమతో దగ్గరికి తీసుకొని మరో పెళ్లి చేయగా.. పెళ్లి అయిన రెండేళ్లకి అతని నుండి కూడా విడిపోయి మెగా ఫ్యామిలీలో ఒక మాయని మచ్చ మిగిల్చింది.
Advertisement
Advertisement
ఇలాగే నాగబాబు కూతురు నిహారిక కూడా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న, అక్క నుంచి ఇన్ స్పైర్య్య అచి చిన్న విభేదాల కారణంగానే భర్త నుండి విడిపోయింది. అయితే ఈ ఇద్దరు మెగా కూతుర్ల వల్ల మెగా ఫ్యామిలీ పరువు పోయిందని ఫ్యాన్స్ బాధపడుతూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కూడా ఉండడం వల్ల మెగా ఫ్యామిలీలో భాగంగా వీళ్ళ టాపిక్ తీసి ప్రతిపక్షం ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా వీళ్ళు వరుణ్ లావణ్య పెళ్లిలో సందడి చేయడం మెగా ఫ్యాన్స్ కి సైతం అంతగా నచ్చలేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఇలాంటివి ఈ రోజుల్లో చాలా కామన్. ఇలాంటి శుభ సందర్బాల్లో కూడా నెగిటివ్ గా మాట్లాడడం సరికాదని మరికొందరు అభిమానులు భావిస్తున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!