Keeda Cola Movie Review : టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలను తెరకెక్కించాడు. ముఖ్యంగా సున్నితమైన కథలను రాసుకొని.. వాటిలో నవ్వించే స్కిల్స్ ను పుట్టించడం తరుణ్ భాస్కర్ కి తెలుసు. ఇతని లో మంచి నటుడు కూడా ఉన్నాడు. ఈసారి తాను దర్శకత్వం వహించిన కీడా కోలా మూవీతో తానే నటించాడు. ఈ కీడా కోలా మూవీ ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఒకసారి చూద్దాం.
Advertisement
నటీ, నటులు : తరుణ్ భాస్కర్, చైతన్య, రగ్ మయూర్, బ్రహ్మానందం, విష్ణు, జీవన్, రవీంద్ర విజయ్, రఘురాం తదితరులు.
దర్శకుడు : తరుణ్ భాస్కర్
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రాపర్ : A J అరోన్
ప్రొడక్షన్ డిజైనర్ : ఆశీష్ తేజ
వ్యవధి : 120 నిమిషాలు
కథ :
ఇది ముగ్గురి గ్యాంగ్ ల మధ్య నడుస్తుంది. వాస్తు (చైతన్య), వరదరాజ్ (బ్రహ్మానందం), రాగ్ మయూర్ (లాయర్, లంచం)గ్యాంగ్ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే కసిమీద ఉంటారు. అలాంటి వారికి ఓసారి కీడా కోలా కొంటే.. అందులో ఓ బొద్దింక వస్తుంది. దీంతో కంపెనీ మీద కేసు వేసి కోట్లు లాగేయాలని చూస్తుంది. మరోవైపు తనకు జరిగిన అవమానాలకు కసీ తీర్చుకునేందుకు ఎలాగైనా సరే కార్పొరేటర్ కావాలనుకుంటాడు జీవన్. తన అన్న నాయుడు(తరుణ్ భాస్కర్) జైలు నుంచి రిలీజ్ అయి వస్తున్నాడని సంబురపడుతారు. నాయుడు శాంత స్వరూపుడిగా మారతాడు. గొడవలు వద్దనుకొని.. కీడా కోలా కంపెనీలో పని చేసుకుంటాడు. కార్పొరేటర్ కావాలంటే కోటీ కావాలి కదా..? అని దానిని సంపాదించేందుకు ఓ ప్రణాళిక రచిస్తాడు. దీని ప్రకారమే కీడా కోలాలో బొద్దింకను వేస్తాడు. ఇక ఈ మూడు గ్యాంగ్ ల మధ్య ఏం జరిగింది..? అసలు ఈ బొద్దింక ఉన్న కీడా కోలా చివరికీ ఏం అయింది ? ఎవ్వరికీ డబ్బు అందుతుంది? నాయుడు, జీవన్ ల కథ ఏమైంది అనేది థియేటర్లలో చూడాల్సిందే.
Advertisement
విశ్లేషణ :
ప్రస్తుతం వస్తున్న కామెడీ జోనర్లకు డిమాండ్ బాగానే ఉంది. జాతి రత్నాలు, మ్యాడ్ వంటి మూవీస్ కి కథలు అవసరం లేదు. కీడా కోలా విషయానికి వస్తే.. కామెడీని ప్రధానంగా తీసుకున్నాడు తరుణ్ భాస్కర్. స్క్రిప్ట్ బాగానే రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. తెరపై నవ్వులు పూయించాడు. పాత్ర చిత్రీకరణ ఒక్కోపాత్రకు పెట్టి మాడ్యులేషన్ చూపించిన తీరు బాగుంటుంది. ఎక్కడో ఓ వెలితి మాత్రం కనిపిస్తుంటుంది. తెరపై సందర్భానుసారంగా నవ్వుకుంటూ వెళ్తాం.. ఫస్ట్ హాఫ్ కాస్త బోరింగ్ గా అనిపించినా..ద్వితీయార్థంలోనే ఎక్కువగా నవ్వుతాం. ముఖ్యంగా షూటర్స్ ఒక్కొక్కరూ వస్తుంటే.. వారి లోపాలను చూపిస్తుంటే.. థియేటర్లలో కేకలు వినిపిస్తాయి. కొన్నిసార్లు ఈ మూవీ ఎప్పటి కాలానిదో అర్థం కాకుండా ఉండటం మైనస్. ఊహకందేలా సాగే కథనం కూడా మరో మైనస్ అనే చెప్పాలి.
ప్రారంభంలో కాస్త స్లోగా సాగి.. మధ్యలో వేగం పెంచి.. చివరికీ చిన్న ట్విస్ట్ తో కోడా కోలా ముగుస్తుంది. ఇందులో నాయుడుగా తరుణ్ భాస్కర్ పాత్ర అందరికీ ఎక్కువగా గుర్తుండిపోతుంది. చైతన్య వెరైటీ మ్యానరిజంతో ఆకట్టుకుంటాడు. బ్రహ్మానందం నుంచి అయితే ఆశించినంతగా లేదు. లాయర్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. విష్ణు తన పాత్రకు న్యాయం చేశాడు. నవ్వించడంలో విష్ణు టైమింగ్ వేరు. మిగతా వారి పాత్రలన్ని కూడా బాగానే ఉన్నాయి. కెమెరా పనితనం బాగుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ముఖ్యంగా జీవితం, స్వేచ్ఛ, నమ్మకం, డబ్బు, ప్రాధాన్యం, ప్రేమ గురించి చెప్పే మాటలు ఆకట్టుకుంటాయి. మొత్తానికి ఈ సినిమా నిడివి తక్కువగా ఉండటంతో ప్రేక్షకులు కూడా బాగానే వీక్షించే అవకాశం కనిపిస్తోంది.
మైనస్ పాయింట్స్ :
- ఫస్టాప్ కాస్త బోరింగ్
- ఊహకు అందేలా సాగే కథనం
ప్లస్ పాయింట్స్
- తరుణ్ భాస్కర్
- విష్ణు కామెడీ
- డైలాగ్స్
- నిడివి తక్కువ
రేటింగ్ : 2.5/5