తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈయన కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించినా.. కుటుంబ కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ఫ్యామిలీ హీరోగా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. తన సెకండ్ ఇన్నింగ్ లో యంగ్ హీరోలకు బాబాయి పాత్రలో నటిస్తూ సందడి చేయడంతో పాటు విలన్ క్యారెక్టర్ లో కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు.
Advertisement
ఊహ తల్లిదండ్రుల ముందే ప్రపోజ్ చేశాడట శ్రీకాంత్. ఊహ ఇండస్ట్రీకి దూరమవ్వడానికీ కారణం ఏంటి.. ఇకపోతే ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటన ద్వారా అందరినీ మెప్పించిన శ్రీకాంత్ నటి ఊహను పెళ్లి విషయం అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఊహతో కలిసి సుమారు నాలుగు సినిమాల్లో నటించారు. వీరూ కలిసి నటించిన ఫస్ట్ మూవీ ఆమె. ఈ చిత్రం సమయంలోనే శ్రీకాంత్ ఊహ ప్రేమలో పడ్డాడట. తనపై ప్రేమతో నిత్యం తన ఇంట్లో జరిగే ఫంక్షన్లకు వెళ్తూ తన కుటుంబానికి దగ్గరయ్యాడు. ఊహపై ఉన్న ప్రేమను శ్రీకాంత్ బయట పెట్టలేదు. తన కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్న తరుణంలో తనకు ఊహ అంటే ఇష్టమని చెప్పాడట శ్రీకాంత్.
Advertisement
ఊహ కోసం ఓ బంగారు గొలుసు తీసుకొని తన ఇంటికి వెళ్లి దేవుడి దగ్గరకు తన తల్లిదండ్రులను కూడా అక్కడికీ పిలిచి తను కొన్ని బంగారు గొలుసును ఊహ మెడలో వేసి తనంటే ఇష్టం అని తనను పెళ్లి చేసుకుంటానని తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఇలా శ్రీకాంత్-ఊహ పెళ్లి జరిగింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఊహ. పెళ్లి తరువాత ఊహ పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఈమె ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం.. కేవలం తన పిల్లల బాధ్యతలను నెరవేర్చుకోవడం కోసమే తాను ఇండస్ట్రీకి దూరమయ్యారని తెలియజేశారు. తన లైఫ్ లో సెకండ్ వస్తే తన కొడుకు రోషన్ కి తల్లిపాత్రలో నటించాల్సి వస్తే భర్త శ్రీకాంత్ తో కలిసి నటిస్తానని.. తనకు ఆ కోరిక ఉందని చెప్పింది ఊహ. శ్రీకాంత్ నటించిన తారకరాముడు, ఖడ్గం సినిమాలు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!