Home » మీకు అదృష్టం కలిగే ముందు కనిపించే సంకేతాలు ఇవే..!

మీకు అదృష్టం కలిగే ముందు కనిపించే సంకేతాలు ఇవే..!

by Anji
Ad

సాధారణంగా ఎవ్వరికైనా ఎప్పుడైనా కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ అదృష్టం మాత్రం అప్పుడప్పుడే తలుపు తడుతుంది. ఎంత కష్టపడినప్పటికీ రూపాయి కూడా మిగలడం లేదు. అదృష్టం ఎప్పుడు కలిసొస్తుందోనని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ జన్మకు ఆ యోగం ఉందో లేదో అని సందేహిస్తుంటారు అదృష్టం కలిసొచ్చే ముందు మనకు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయని శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనింట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ముఖ్యంగా ఇంట్లో పూజలో కొబ్బరికాయ కొడితే పువ్వు రావడం.. ఇంట్లోకి నల్ల చీమలు రావడం. ఇంటి ఆవరణ లేదా గుమ్మం వద్ద పక్షిగూడు కట్టుకోవడం ఇంటి నుంచి బయటికీ వెళ్తున్న సమయంలో గుడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆవు ఎదురుపడటం.. కలలో నెమలి కనిపించినా శుభమే. 

Advertisement

ఇంట్లో వెలిగే దీపం నుంచి చప్పుళ్లు వినిపించడం.. అంటే దీపం అటూ ఇటూ చెదిరి చప్పుడు వస్తుంటుంది. ఇలా వస్తే చాలా మంది దీపం ఆరిపోతుందని కంగారు పడుతారు. కానీ ఆ శబ్దాలు వస్తే మంచిది అట. మంగళవారం ఇంటి పైకి కోతులు రావడం.. కోతులు అలా వచ్చినప్పుడు తరిమివేయకుండా నీళ్లు, ఆహారం పెడితే చాలా మంచిది. ఎందుకు అంటే.. కోతులు.. సాక్షాత్తూ ఆంజనేయస్వామి ప్రతిరూపం.

పాలు కాస్తున్నప్పుడు అనుకోకుండా పొంగడం.. కొత్త జంట కనిపించడం లేదా పని మీద బయటికీ వెళ్లినప్పుడు ఎదురురావడం. ప్రయాణం చేసే సమయంలో పాములు, కోతులు కనిపించడం. ఇంట్లో గబ్బిలం గూడు కట్టుకుంటే ఇంకా మంచిది. 

సాధారణంగా నక్షత్రాలు అనేవి రాలుతుంటాయి. అలాంటి అప్పుడు వాటిని చూస్తే.. చాలా మంచి జరుగుతుంది. రాలుతున్న నక్షత్రాలను చూసి ఎలాంటి కోరిక కోరుకున్నా అది తప్పకుండా కొద్ది రోజుల్లోనే నెరవేరుతుందట. అదేవిధంగా తాబేలు, ఏనుగులను చూసిన చాలా మంచిది. ఇలా మనకు కనిపిస్తున్న సందర్భాన్ని బట్టి మనం నడుచుకోవాలి.

Visitors Are Also Reading