సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా వెంటనే అందరి వద్దకు నిమిషాల వ్యవధిలోనే చేరుకుంటెన్నాయి. అందులో ఇక ఫుడ్ లవర్స్ కోసం అయితే డిఫరెంట్ పుడ్స్ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తూ ఉన్నాయి.
Advertisement
తాజాగా స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కోసం ఓ భారీ స్నాక్ ఐటెం ఓ వీడియో ఇప్పుడు మామూలుగా హడావుడి చేయడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 30 గుడ్లతో తయారు చేసిన అత్యంత భారీ ఎగ్ రోల్ ఈ వీడియోలో ఎగ్ రోల్ చాలా మంది నెటజన్లను ఆకర్షించింది. ఎగ్ రోల్ సైజ్, తయారీ చేసిన విధానానికి ఫిదా అయ్యారు. రకరకాల ఎమోజీలతో తమ ఇష్టాన్ని తెలియజేస్తున్నారు.
Advertisement
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలోని బ్రహ్మపుత్ర మార్కెట్లో ఈ వీడియోను చిత్రీకరించారు. ఎగ్ రోల్‌ను సిద్ధం చేసేందుకు ఓ వ్యక్తి తొలుత.. పైనం మీద కొంచెం నూనే వేసి.. తరువాత కట్ చేసిన కూరగాయల ముక్కలతో పాటు ఉప్పు, కారం, సాస్ వేసి ఫస్ట్‌ను తయారు చేసాడు. అనంతరం కొన్ని చపాతి పిండి ఉండలను తీసుకుని, దానిని ఒకదానిపై ఒకటిగా వేసి.. పెద్ద చపాతిలా ఒత్తాడు. ఆ పెద్ద చపాతిని మళ్లీ పెనం మీద వేసి వేయించాడు. తరువాత దానిపై దాదాపు 30 గుడ్లను వేసి.. ఆమ్లెట్‌గా వేయించి.. అప్పుడు ఆ ఆమ్లెట్ పై కూరగాయల ఫస్ట్‌ను మరికొన్ని కొన్ని ఉల్లిపాయల ముక్కలను వేసి.. ఎగ్ రోల్‌ను తయారు చేశాడు. ఈ వీడియో 30 గుడ్లు రోల్ అని.. దీనిని ఒంటరిగానే పూర్తి చేయగల వ్యక్తి అంటూ పోస్ట్ చేశారు. వీడియో పలువురు చూపర్లను ఆకట్టుకుంది. హార్ట్ ఎమోజీలతో తమ లవ్ తెలియజేస్తున్నారు ఫుడ్ లవర్స్.