అప్గానిస్తాన్ క్రికెట్ జట్టు ఈ వరల్డ్ కప్ లో తనకంటే బలమైనటువంటి ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లను ఓడించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విజయాల కోసం ఆప్గనిస్తాన్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. రషీద్ ఖాన్ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగంలో మొదటి నుంచి బలంగానే ఉంది. కానీ బ్యాటింగ్ విభాగం బలహీనంగా ఉండేది. ఈ సమస్యను అప్గాన్ అధిగమించింది.
Advertisement
అయితే ఆసియా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో నెట్ రన్ రేట్ కాలిక్యులేసణ్ పట్ల కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడంతో అప్గాన్ సూపర్ 4కి అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. లాహోర్ వేదికగా ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని అప్గాన్ 40 ఓవర్లలోనే చేధిస్తే మెరుగైన నెట్ రన్ రేట్ తో సూపర్ 4 చేరుకుంది. ఇందుకు తగ్గట్టుగానే అప్గాన్ బ్యాటర్లు దూకుడుగానే ఆడారు. చివరిలో తొందరపడి వికెట్లను కోల్పోయారు. రషీద్ ఖాన్ క్రీజ్ లో ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేట్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల అప్గాన్ ఈ మ్యాచ్ గెలవలేకపోయింది. ఒక బంతికే మూడు పరుగులు చేయాలనుకొని ముజీబ్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు.
Advertisement
అప్గాన్ 37.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయింది. సూపర్ 4 కి అర్హత సాధించాల్సిన మ్యాచ్ లో 3 పరుగుల తేడాతో ఓడింది. వరల్డ్ కప్ లో పక్కా ప్రణాలికతో బరిలోకి దిగింది. ముఖ్యంగా శ్రీలంకతో మ్యాచ్ లో 30 ఓవర్లు పూర్తి అయ్యే సరికి 150 పరుగులు చేయాల్సి ఉండగా.. 139 పరుగులు చేసింది. కానీ 40 ఓవర్లు పూర్తి అయ్యే సరికి 200 పరుగులు చేయాల్సి ఉండగా.. గేర్ మార్చి 201 రన్స్ చేసింది. 48 ఓవర్లోల ఛేజింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 45.2 ఓవర్లలోనే టార్గెట్ ని ఛేదించి టాస్క్ ఫినిష్ చేసింది. ఆసియా కప్ అనుభవంతో పాఠాలు నేర్చుకున్న అప్గానిస్తాన్.. ఆటతోనే కాకుండా ప్లానింగ్ తో అద్భుతంగా ఆడటం పట్ల అభినందించాల్సిందే.