తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు వెళుతున్నారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మద్రాస్ లో ఉండటం వల్ల చెన్నైలోనే చాలామంది యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుని నటులుగా మారేవారు. అయితే సినిమా ఇండస్ట్రీలో నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రజిని కాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్ లాంటి ముగ్గురు నటులు కూడా ఒకే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నారట.
అయితే ఆ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన మొదటి బ్యాచ్ లో రజినీకాంత్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత బ్యాచ్ లో రాజేంద్రప్రసాద్ నేర్చుకున్నాడు. ఇక వీళ్లిద్దరి తర్వాత చిరంజీవి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ నేర్చుకొని ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. అలా వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకొని ఆ తర్వాత ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే చాలామంది నటులు యాక్టింగ్ కోర్సులు జాయిన్ అయి యాక్టింగ్ నేర్చుకుంటున్నారు. అయితే చిరంజీవి నాకంటే జూనియర్ అయినప్పటికీ నేను ఎప్పుడూ చిరంజీవిని ర్యాగింగ్ చేయలేదు అంటూ రాజేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పాడు.
Advertisement
Advertisement
ఇక రజినీకాంత్ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అవ్వగా.. చిరంజీవి మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో 30 సంవత్సరాల పాటు మెగాస్టార్ గా వెలుగొందారు. రాజేంద్రప్రసాద్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈయనకి ప్రస్తుతం ఆయనకి మార్కెట్ లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ తనదైన నటన ప్రతిభను చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఇప్పటికీ కూడా వీళ్లు ముగ్గురు సినిమాల్లో నటిస్తూ మంచి నటులుగా మంచి పేరు సంపాదించుకుంటూ వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే రజనీకాంత్ జైలర్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. చిరంజీవి కూడా వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్నాడు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.