కామాక్షి భాస్కర్ల మా ఊరి పొలిమేర సినిమా చూసిన వాళ్లకు ఈ నటి తెలిసే ఉంటుంది. పొలిమేర మాత్రమే కాదు.. విరూపాక్ష, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాల్లోనే కాదు.. ఝాన్సీ, సైతన్ వెబ్ సిరీస్ లోను మెరిసింది. అయితే గుర్తింపు తెచ్చింది మాత్రం పొలిమేర. ఇప్పుడు ఈ నటి మా ఊరి పొలిమేర 2 లో కూడా కనిపించబోతుంది. అయితే ఈ నటి గురించి ఆమె బ్యాగ్రౌండ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటులతో ఈమెకు ఉన్న సంబంధం గురించి కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈమె గురించి కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Advertisement
Advertisement
చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన కామాక్షి భాస్కర్ల అపోలో ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేసింది. తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, మిస్ తెలంగాణగా కిరీటం గెలుచుకుంది. తర్వాత మిస్ ఇండియా పోటీల్లో ఫైనల్స్ వరకు వెళ్ళింది. ఈ విషయాలు అందరికీ తెలుసు. కానీ, ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు. ఇండస్ట్రీలో మంచి పేరున్న కెమెరా మెన్ కూతురే కామాక్షి భాస్కర్ల. అయితే తన తండ్రి గురించి మాత్రం ఎప్పుడూ బయటకి చెప్పలేదు. అంతే కాదు, సీనియర్ నటి సూర్యకాంతం, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభకు కామాక్షి భాస్కర్ల బంధువులు.
ఈ విషయాన్ని స్వయంగా కామాక్షి భాస్కర్ల ఓ సందర్భంలో చెప్పింది. అయితే ఇప్పటి వరకు తన ఫ్యామిలీ విషయాలను ఎందుకు బయట పెట్టలేదు అంటే మాత్రం సమాధానం లేదు. అలాగే తన తండ్రి పేరును ఎందుకు చెప్పలేదు అంటే కూడా ఆన్సర్ లేదని చెప్పాలి. కాగా, ఈ బ్యూటీ.. సొంతంగా ఓ హాస్పిటల్ నిర్మించుకుని దాన్ని చూసుకోవాలని అనుకుంటుందట.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.