మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అందుకొని మైలురాళ్ళు లేవు. 1979లో పునాదిరాళ్ళు చిత్రంతో కెరీర్ ప్రారంభించిన చిరు వడివడిగా అగ్రస్థానం వైపు అడుగులు వేశారు. 1983 వరకు వచ్చిన ప్రతి అవకాశంలో తన ప్రత్యేకత చాటుతూ ఇండస్ట్రీలో నెమ్మదిగా చర్చనీంశంగా మారారు చిరంజీవి.
Advertisement
అంతలోనే ఒక్కసారిగా బాక్సాఫీస్ కుదుపు. చిరంజీవి పేరు మారుమోగిపోయింది. దీనితో చిరు అగ్ర నటుల జాబితాలో చేరిపోయారు. చిరంజీవి నటనకు, డ్యాన్సులకు, ఫైట్స్ కి తిరుగులేదు అంటూ ప్రశంసలు కురిశాయి. ఇదంతా జరిగింది ఒక్క చిత్రంతోనే. ఆ చిత్రమే ఖైదీ. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఈ రోజున ఖైదీ చిత్రం విడుదలై ప్రభంజనం సృష్టించింది. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే ముందుగా చెప్పేది ఖైదీ చిత్రం గురించే. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, సంయుక్త మూవీస్ నిర్మాణంలో, పరుచూరి బ్రదర్స్ రచయితలుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ ఏ రేంజ్ కి చేరుకున్నారో అందరికీ తెలిసిందే.
Advertisement
ఈ చిత్రం విడుదలై 40 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా చిరు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘ఖైదీ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం.. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ , ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత, మాధవి లని మొత్తం టీమ్ ని అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మా కందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అంటూ చిరు పోస్ట్ చేశారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.