సాధారణంగా సూర్యకాంతం పేరు చెబితే జనం హడలిపోతారు. ముఖ్యంగా ఈ పేరు పెట్టుకోవాలన్నా కానీ ఎవరైనా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. గయ్యళితనం అనే పదానికి అర్థం సూర్యకాంతమే అనే విధంగా తెలుగువారి మనస్సులో చెరగని ముద్ర వేసిన గొప్ప నటీమణి సూర్యకాంతం. తెరపై కనిపించే సూర్యకాంతం.. తెరవెనుక సూర్యకాంతం పూర్తిగా భిన్నంగా ఉండేవారట. అందరినీ కలుపుకుపోయే మనస్థత్వం కలిగిన నటిమణి.. ఆమె మరణించినప్పుడు అప్పట్లో ఇండస్ట్రీలోని పెద్దలు ఎవ్వరూ వెళ్లలేదని చెబుతుంటారు. చివరి క్షణాల్లో సూర్యకాంతం గారికి దక్కాల్సిన గౌరవం దక్కలేదని పేర్కొంటారు.
Advertisement
సూర్యకాంతం ఆ పేరు వినగానే అందరూ భయపడుతుంటారు. వాస్తవానికి సూర్యకాంతం చాలా సున్నిత మనస్కురాలట. తెరపై కఠినమైన పాత్రల్లో కనిపించిన ఆమెను బయట చూసిన మహిళలు సైతం దగ్గరికి వెళ్లి పలకరించడానికి కూడా భయపడేవారట. షూటింగ్ లో పాత్ర వరకు కఠినమైన డైలాగ్ లు చెప్పిన తరువాత నొచ్చుకునేవారట. తనను మన్నించమని సీనియర్ నటులను అడిగేవారట. అదంతా మీ పాత్ర మీరు కాదని వారందరూ నచ్చచెప్పేవారట. సూర్యకాంతం మంచి నటి మాత్రమే కాదు.. వంటలను కూడా చాలా రుచిగా చేస్తుందట. షూటింగ్ సమయంలో అందరికీ భోజనాలు వండి మరీ తెచ్చేదట. ఆమె చివరి సినిమా ఎస్పీ పరశురామ్. ఇక ఆ తరువాత కూడా నటించాలనుకున్నా.. ఆరోగ్యం సహకరించలేదట.
Advertisement
డయాబెటీస్ తో బాధపడుతూ కేవలం ఇంటికే పరిమితమయ్యారట. ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదని చెబుతుంటారు. ఆమె చనిపోయినప్పుడు కూడా ఎవ్వరూ వెళ్లలేదట. గొప్ప నటీమణికి చాలా దయనీయమైన పరిస్థితుల్లో అంత్యక్రియలు జరిగాయని చెబుతుంటారు. నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు సూర్యకాంతంతో హాస్యంగా నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటి ఉంది.. సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవ్వరూ పెట్టుకోకుండా చేశావని అంటుండేవారట. గుండమ్మ కథ మూవీని ఇప్పటితరం దర్శకులు తీయకపోవడానికి ఓ కారణం ఉంది. ఆ సినిమాలో ఇతర నటులను రీ ప్లేస్ చేసే నటులు ఉన్నారేమో కానీ.. గుండమ్మ పాత్రను రీ ప్లేస్ చేసే నటీమణి లేకపోవడంతో ధైర్యం చేయలేక ఆ సినిమా తీసే ప్రయత్నం చేయలేదని అంటారు. అది సూర్యకాంతం నటన గొప్పతనం. సూర్యకాంతం నటనను భర్తీ చేసే నటీమణి భవిష్యత్ తరాలలో కూడా ఎదురుపడకపోవచ్చు. తెలుగు సినిమా పరిశ్రమలో ఆమె నటన ఆమె నటన.. ఆమె అత్త పాత్ర చిరస్మరణీయం అనే చెప్పాలి.
టాలీవుడ్ వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.