దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా వెనుక చిత్ర యూనిట్ కృషి ఎంత ఉందో చెప్పవచ్చు. చిన్న చిన్న సీన్స్ వద్ద కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కటి అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ చూస్తే ముసలి వాళ్లు కూడా స్టెప్ వేయాల్సిందే. అంత గొప్పగా సాంగ్ ను తీర్చిదిద్దారు. ఈ పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చిందట.
Advertisement
also read:విడాకులు ఇవ్వాలని మూడో భార్యకు నరేష్ అన్ని కోట్లు ఆఫర్ చేశాడా..? సంచలన నిజాలు ఇవే..!
కాలిఫోర్నియాలోని ది బేవర్లి హీల్టన్ వేదికగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు కార్యక్రమంలో ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాటకు బహుమతి దక్కిందట. ఈ బహుమానాన్ని మ్యూజిక్ డైరెక్టర్ అందుకున్నారు. ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి కొరియోగ్రాఫర్ రక్షిత్ చాలా కష్టపడ్డారట.. అయితే ఈ పాటకు అంతర్జాతీయ గుర్తింపు రావడంతో ఒక ఇంటర్వ్యూలో ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ టీం ఒక మాస్ సాంగ్ కూడా తీయాలనుకున్నారట. ఈ పాట చాలా డిఫరెంట్ గా ఉండాలని వారు భావించి ఉక్రెయిన్ లో షూట్ చేశారు. అయితే ఈ సాంగ్ వెనుక కనిపించే ప్యాలెస్ గ్రాఫిక్స్ మాత్రం కాదు..
Advertisement
అది రియల్ గానే ఉందట.. ఆ ప్యాలెస్ ఉక్రెయిన్ అధ్యక్షుడిది. మీరు దాన్ని నిశితంగా గమనిస్తే దాని పక్కనే పార్లమెంట్ కూడా కనిపిస్తుంది. ఈ భవనంలో పర్మిషన్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఒకప్పుడు ఆర్టిస్టు కాబట్టి అనుమతి ఇచ్చారని రాజమౌళి గుర్తు చేశారు. వాస్తవానికి ఈ సాంగు కోసం కొరియోగ్రాఫర్ రక్షిత్ టీం ఏకంగా 80 వేరియేషన్ స్టెప్స్ ని రికార్డు చేసిందట. వీటన్నింటిని చూసిన రాజమౌళి టీం ఫైనల్ గా మనం చూసిన స్టెప్ ని ఓకే చేశారట. ఈ స్టెప్పు సాంగ్ కు ఎంతో సూటవడంతో సూపర్ హిట్ అయిందనీ చిత్ర యూనిట్ తెలియజేసింది.
also read: