నిన్న మొన్నటి వరకు సినిమా అంటే.. కథ రాసే రచయిత ఒకరు, సినిమా తీయడానికి దర్శకుడు ఒకరు, నటించడానికి హీరోగా మరొకరు ఉండేవారు. కానీ ప్రస్తుతం ప్రతిభకు కొలమానం ఏమీ లేదు. హీరోలే దర్శకులుగా, నిర్మాతలుగా మారుతున్నారు. అలా, టాలీవుడ్ లో కూడా తమ కథలను తామే రాసుకుని హిట్లు కొట్టిన ఐదుగురు హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
అడవిశేష్:
విభిన్న కథలను ప్రేక్షకులకు పరిచయం చేసేవారిలో అడవిశేష్ ముందుంటారు. “క్షణం” నుంచి “మేజర్” వరకు తాను నటించిన నాలుగు సినిమాలకు ఆయనే రచయితగా ఉన్నారు. తానె కథ రాసుకుని, హీరోగా నటించి నాలుగు సినిమాలు హిట్లు కొట్టాడు అడవిశేష్. దర్శకుడిగా కూడా అడవిశేషు రాణించడానికి ప్రయత్నిస్తున్నారు.
విశ్వక్ సేన్:
సొంతంగా ఇండస్ట్రీలో పైకి వచ్చిన హీరోలలో విశ్వక్ సేన్ ముందు ఉంటారు. కేవలం నటనలో మాత్రమే కాదు.. దర్శకత్వంలో కూడా ప్రతిభ చాటుకున్న ఘనుడు ఆయన. తాను నటించిన రెండు సినిమాలనూ ఆయనే డైరెక్ట్ చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఫలక్ నామ దాస్ కి కూడా విశ్వక్ నే కథ అందించారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ రేంజ్ లో హిట్ కాలేదు. కానీ, విశ్వక్ సేన్ లోని దర్శకుడు మాత్రం అందరికి నచ్చేసాడు. రీసెంట్ గా “దాస్ కా ధమ్కీ” తో వచ్చి ఇరగదీసాడు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ లో నటించారు.
Advertisement
నవీన్ పోలిశెట్టి:
ఓ వైపు హీరోగా నటిస్తూనే రచయితగా కూడా నవీన్ పోలిశెట్టి రాణిస్తున్నారు. “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమాకు ఆయనే స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. ఇక “జాతిరత్నాలు” స్క్రిప్ట్ లో కూడా ఆయన హస్తం ఉందని అంటుంటారు.
కిరణ్ అబ్బవరం:
ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చి నిలదొక్కుకుంటున్న హీరో కిరణ్ అబ్బవరం. “ఎస్ఆర్ కళ్యాణమండపం” సినిమాకు తానె రచయితగా మారి కథ, మాటలు, స్క్రీన్ ప్లే ను అందించారు.
సిద్దు జొన్నల గడ్డ:
“కృష్ణ అండ్ హిస్ లీల” అనే సినిమాతో పాపులర్ అయిన సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాకే తానె కథ, స్క్రీన్ ప్లే ను అందించారు.
SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !
పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్
MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !