అలనాటి హీరోలైన అక్కినేని నాగేశ్వర రావు మరియు నందమూరి తారక రామారావు అంటే ఇండస్ట్రీలో క్రేజ్ ఉండేది.. వీరిద్దరు పోటాపోటీగా సినిమాలు చేస్తూ ఒకరికంటే ఒకరు ఎక్కువ అన్న విధంగా ఉండేవారు. సరిగ్గా 1962లో మొత్తం మూడు సార్లు విపరీతమైన పోటీ ఏర్పడింది. మొదట ఫిబ్రవరి 9వ తేదీన “గాలిమేడలు” సినిమా ద్వారా ఎన్టీఆర్ రాగా, దానికి వారం గ్యాప్ లోనే “ఆరాధన”తో వచ్చారు ఏఎన్ఆర్. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్నాయి..
Advertisement
also read:కీర్తి సురేష్ కి మృణాల్ ఠాకూర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?
Advertisement
ఇక ఆ తర్వాత రెండవ సారి “మంచి మనసులు” చిత్రం తో అక్కినేని ఏప్రిల్ 11వ తేదీన రాగా, దానికి వారం గ్యాప్ తో “భీష్మ” అంటూ వచ్చారు ఎన్టీఆర్. మంచి మనసులు చిత్రంలో ఏఎన్ఆర్ హీరోగా షావుకారు జానకి, సావిత్రి హీరోయిన్స్ గా నటించగా..ఆశయం కోసం ప్రేమను త్యాగం చేసే ఏఎన్నార్ సావిత్రి అద్భుతంగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఎన్టీఆర్ భీష్మ విషయానికి వస్తే పాండవుల యుద్ధంలో భీష్ముని పాత్రను ప్రధానంగా హైలెట్ చేశారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది.
ఇక ఈ స్టార్ నటలు ఇద్దరు మళ్ళీ ఆగస్టులో పోటీపడ్డారు. స్వర్ణమంజరి సినిమాతో ఎన్టీఆర్ ఆగస్టు పదవ తేదీన రాగా..దానికి రెండు వారాల గ్యాప్ తో కులగోత్రాలు సినిమాతో వచ్చారు ఏఎన్ఆర్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. 1962లో వీరిమధ్య ఏర్పడిన పోటీలో ఇద్దరు సమవుజ్జీలుగా నిలిచారు.
also read: