మెగాస్టార్ చిరంజీవి రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ శుభ ముహుర్తాన తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారో తెలియదు కానీ.. తెలుగు ప్రజల గుండెల్లో నిజంగానే చిరంజీవి మిగిలాడు. ఆచారి సినిమా విడుదల అయితే బాక్సాఫీస్ పండుగ చేసుకుంటుంది. ఇక మెగాస్టార్ అభిమానుల గురించి చెప్పనవసరమే లేదు. తన 40 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలు, అందులో కొన్ని హిట్‌ల, సూపర్ హిట్‌లు, ప్లాప్‌లు, అట్టర్ ప్లాప్‌లు, బ్లాక్ బస్టర్ హిట్‌లు ఇలా అన్ని రకాలుగా ఇండస్ట్రీలో కొనసాగారు.
Advertisement
ముఖ్యంగా టాలీవుడ్‌కు పరిచయం లేని ఎన్నో రికార్డులను చిరంజీవి చేసినవే. ఆయన కటౌట్‌కు ఓ లెక్క ఉంటది ఓ లెక్కలతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతారు. బాక్సాఫీస్ దగ్గర కటౌట్ అడుగు పెద్దే చాలు కోట్ల వ్యాపారం జరుగుతోంది. 60 ఏళ్లలో కూడా ఆయన సినిమాలు చేస్తూ.. ముఖ్యంగా సైరా నరసింహా సినిమాకు చాలా తక్కువ టైమ్ 20 గంటలు సినిమా డబ్బింగ్ పార్ట్ అంతా పూర్తి చేసి ఇదంతా నాకు చాలా మామూలు విషయం అన్నారు. చిరంజీవి పేరు మీద ఉన్న రికార్డులను తెలుసుకోండి.
1. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్‌ను ఓడించిన ఆపద్భాంధవుడు కోసం భారతదేశంలో ఓ చిత్రానికి 1.25 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి హీరో. ఈ విషయాన్ని ది వీక్ కవర్ పేజీపై తన చిత్రాన్ని ప్రచురించింది.
2. ఆస్కార్ అవార్డులకు ఆహ్వానించబడిన మొదటి దక్షిణ భారత నటుడు చిరంజీవి కావడం విశేషం. 1987లో అకాడమీ అవార్డులకు గౌరవ అతిథిగా ఆహ్వానించబడ్డాడు.
Advertisement
3. భారతదేశంలో 7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి హీరో . ముఖ్యంగా ఇంద్ర సినిమాకు చిరంజీవి 7 కోట్లు తీసుకోగా.. అదే సమయంలో లగాన్ సినిమాకు అమీర్ ఖాన్ 6 కోట్లు తీసుకున్నారు.
4. మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు సినిమా బాక్సాఫీస్ వద్ద 10 కోట్లు వసూలు చేసిన మొదటి తెలుగు సినిమా కావడం విశేషం.
5. ఇక చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన తొలి వెలుగు సినిమా.
6. ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర వంటి 8 ఇండస్ట్రీ హిట్‌లు సాధించిన ఏకైక టాలీవుడ్ హీరో చిరంజీవి.
7. నెట్‌లో వ్యక్తిగత వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మొట్టమొదటి భారతీయ నటుడు.
8. టాలీవుడ్‌లో ఉత్తమ నటుడిగా అత్యధికంగా 7 ఫిల్మ్‌ఫెయిర్ అవార్డులు పొందిన ఏకైక హీరో నటుడు.
9. చిరంజీవి ఏపీ, తెలంగాణల్లో 47 డైరెక్ట్ వంద రోజుల సినిమాలున్నాయి. టాలీవుడ్‌లో మాత్రమే హీరో.
10. సైరా నరసింహారెడ్డిలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేయడానికి కేవలం 20 గంటల సమయం తీసుకున్నాడు.