Home » విరాట‌ప‌ర్వం సినిమా చూడ‌డానికి 10 కార‌ణాలు.. అవి ఏమిటంటే..?

విరాట‌ప‌ర్వం సినిమా చూడ‌డానికి 10 కార‌ణాలు.. అవి ఏమిటంటే..?

by Anji
Ad

ద‌గ్గుబాటి రానా, సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లో న‌క్స‌ల్ బ్యాగ్రౌండ్‌లో వ‌స్తున్న తాజా చిత్రం విరాట‌ప‌ర్వం. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రేపు విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. న‌క్స‌ల్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కించిన ఈ సినిమా చూడ‌డానికి 10 కార‌ణాలున్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

విరాట ప‌ర్వం ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల సొంత ఊరు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా. ఈయన‌కు సాహిత్య‌మంటే ఎంతో ఇష్టం. సామాజిక అంశాలు, చ‌రిత్ర‌లోని దాగిన క‌థ‌ల‌ను వెలికి తీసి సిల్వ‌ర్ స్క్రీన్ పై ప్ర‌జెంట్ చేయాల‌నేదే ఆయ‌న కోరిక‌. అందులో భాగంగా ఈయ‌న తొలుత‌ శ్రీ‌విష్ణుతో నీది నాది ఒక‌టే ప్రేమ క‌థ సినిమాను తెర‌కెక్కించాడు. అత్యంత అద్భుత‌మైన ప్రేమ‌క‌థ‌గా ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న‌ది. ప్ర‌ధానంగా ఈ చిత్రంలో చ‌దువే జీవితం కాదు అనేది ఇతివృత్తం.


అలాంటి సున్నిత‌మైన ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించిన ఈయ‌న రెండ‌వ ప్ర‌య‌త్నంగా విరాట‌ప‌ర్వం సినిమాను తెర‌కెక్కించాడు. ఎన్నో వాయిదాల త‌రువాత ఈ చిత్రం మ‌రికొద్ది గంటల్లో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వ్వ‌నుంది.

ఇక విరాట‌ప‌ర్వం సినిమా వరంగ‌ల్ గ‌డ్డ‌పై 1990 ద‌శాబ్దంలో జ‌రిగిన క‌థ‌ను ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల తెర‌కెక్కించాడు. ఒక వ్య‌క్తి మ‌ర‌ణం వెనుక పొలిటిక‌ల్ హ‌స్తం ఉంద‌ని తెలుసుకున్న ఇత‌ను ఆనాడు జ‌రిగిన ఘ‌ట‌న‌లను తెర‌పై చిత్రీక‌రించారు. ఇందులో చ‌క్క‌ని ప్రేమ‌క‌థ‌ను కూడా అల్లాడు.


ద‌ర్శ‌కుడు చెబుతున్న‌ప్పుడు 1990 ద‌శ‌కంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.ఈ సినిమాలో పార్టీల‌ను చూపిస్తారా..? లేదా అనేది చూడాలి. ఇందులో రానా పాత్ర‌ను నిజామాబాద్‌కు చెందిన శంక‌ర‌న్న అనే వ్య‌క్తి స్ఫూర్తిగా తీసుకున్నారు. సాయిప‌ల్ల‌వి పాత్ర‌ను వ‌రంగ‌ల్‌కు చెందిన స‌ర‌ళ అనే మ‌హిళ‌ను తీసుకొని సినిమా రూపొందించారు.

ఇక ఈ చిత్రంలో రానా కామ్రెడ్ ర‌వ‌న్న‌గా.. సాయిప‌ల్ల‌వి వెన్నెల పాత్ర‌లో కామ్రెడ్ భార‌త‌క్క‌గ‌గా ప్రియ‌మ‌ణి న‌టించారు. వెన్నెల పాత్ర కోసం సాయిప‌ల్ల‌వి సినిమా షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే ద‌శ‌లో రోజు అంతా ఆహారం తీసుకోలేద‌ట‌. నందితా దాస్‌, జ‌రీనా వాహెబ్‌, ఈశ్వ‌రీరావు, న‌వీన్ చంద్ర‌, సాయిచంద్ వంటి న‌టీన‌టులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రంలో ర‌వ‌న్న పాత్ర‌లో న‌టించేందుకు ఒప్పుకున్న రానాను మెచ్చుకోవాల్సిందేన‌ట‌. హీరో పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌ని త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న స‌మ‌యంలో రానాను క‌లిసి క‌థ వినిపించ‌డంతో రానా ఓకే చెప్పాడ‌ట‌.

Advertisement


ద‌ర్శ‌కుడు వేణు ఈ సినిమా ముందు వ‌ర‌కు సాయిప‌ల్ల‌విని క‌ల‌వ‌లేదట‌. విరాట‌ప‌ర్వం క‌థ‌ను వినిపించేందుకు ఆమెను మొద‌టిసారి క‌లిశార‌ట‌. క‌థ విన్న వెంట‌నే ఆమె ఈ చిత్రంలో న‌టించేందుకు ఓకే చెప్పార‌ట‌. వాటిలో ల‌వ్‌స్టోరీ ఉండ‌దు. న‌క్స‌ల్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన ప్రేమ‌క‌థ‌లో డిఫ‌రెంట్ అనే చెప్ప‌వ‌చ్చు. ఈ చిత్రంలో మావోయిస్టులు, రాజ‌కీయ నాయ‌కులు ఓ అంద‌మైన ల‌వ్‌స్టోరీని తెర‌పై ఆవిష్క‌రించ‌డంతో ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న‌ది.


ఇక చిత్రానికి ప‌ని చేసిన టెక్నిషియ‌న్ల విష‌యానికొస్తే.. దివాక‌ర్ మ‌ణితో క‌లిసి స్పెయిన్‌కు చెందిన డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్ర‌ఫీ బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఈ చిత్రానికి పీట‌ర్ హెయిన్ తో క‌లిసి జ‌ర్మ‌నీకి చెందిన స్టీఫెన్ స్టంట్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ గా పని చేశారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బ‌లి సంగీతం అందించారు.

విరాట‌ప‌ర్వం అనేది మ‌హాభార‌తంలో నాలుగ‌వ ప‌ర్వం. అందులో కుట్ర‌లు కుతంత్రాలు ఉన్న‌ట్టే ఈ సినిమాలో కూడా కుట్ర‌లు, రాజ‌కీయాలు, ఫిలాస‌ఫీ వంటి అంశాల‌ను ఇందులో జోడించారు. ఈ సినిమాకు అందుకే విరాట‌ప‌ర్వం అనే టైటిల్‌ను సాధార‌ణ టికెట్ ధ‌ర‌ల‌తోనే విడుద‌ల చేస్తున్నారు.


విరాట‌ప‌ర్వం సినిమా షూటింగ్ 2019 జూన్ 15న ప్రారంమైంది. తొలుత 2021 ఏప్రిల్ 30న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు భావించారు. ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా ప‌లుమార్లు వాయిదా ప‌డింది. ఓటీటీ సంస్థ‌ల నుంచి ఆఫ‌ర్లు కూడా వ‌చ్చాయి. ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని 2022 జులై 01న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక ఆ త‌రువాత రెండు వారాల ముందుగానే జూన్ 17న విడుద‌ల చేస్తున్నారు.


విరాట‌ప‌ర్వం సినిమా కేవ‌లం తెలుగు భాష‌లో అందుబాటులో ఉంది. 1990 నాటి ప‌రిస్థితులు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించినందుకు ఈ చిత్రం కోసం వైడ్ స్క్రీన్ ఫార్మాట్ ఉప‌యోగించారు.

Also Read : 

నా భర్తను చంపారు..అంటూ సీఐపై తాళిని విసిరి కొట్టిన మహిళ..!

ఉత్త‌ర కొరియాలో అంతు చిక్క‌ని కొత్త వ్యాధి.. భ‌యాందోళ‌న‌లో హోజూ న‌గ‌ర‌వాసులు..!

Visitors Are Also Reading