ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ మన టాలీవుడ్ లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అభిమానులు తమ అభిమాన హీరోల కొత్త సినిమాల కంటే కూడా రీ రిలీజ్ సినిమాలకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అభిమానులు తమ అభిమాన హీరో వింటేజ్ సినిమాలను అప్పట్లో థియేటర్స్ లో మిస్ అయ్యుంటారు కదా.. అందుకే ఈ రీ రిలీజ్ సినిమాలకు అంత క్రేజ్ మరీ. అయితే ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో అత్యధిక రికార్డ్స్ ఉన్నవి కేవలం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలకు మాత్రమే.
Advertisement
గత ఏడాది మహేష్ బాబు పోకిరి సినిమాతో ప్రారంభమైన ఈ ట్రెండ్ జల్సా తో తారాస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఖుషి చిత్రం కూడా రీ రిలీజ్ లో మొదటి రోజు నుంచి క్లోసింగ్ వరకు ఆల్ టైం రికార్డును నెలకొంది. ఈ సినిమా ఫుల్ రన్ రికార్డ్స్ ని ఇప్పటివరకు ఏ హీరో కూడా బ్రేక్ చేయలేదు కానీ, మొదటి రోజు కలెక్షన్స్ ని మాత్రం రీసెంట్ గా మహేష్ బాబు, బిజినెస్ మేన్ రీ రిలీజ్ దాటేసింది. ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇదే ప్రస్తుతానికి ఆల్ టైం రికార్డు. ఈ రికార్డుని పవన్ కళ్యాణ్ ఇప్పుడు గుడుంబా శంకర్ చిత్రంతో బ్రేక్ చేయబోతున్నాడు. సెప్టెంబర్ 2వ తారీకున ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా గుడుంబా శంకర్ ని రీ రిలీజ్ చేయబోతున్నారు.
Advertisement
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ప్రారంభించారు. ముందుగా హైదరాబాద్ లో బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, నాలుగు షోస్ టికెట్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే హౌస్ ఫుల్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫ్లాప్ సినిమాగా పిలవబడే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే 10 రోజుల ముందే హౌస్ ఫుల్స్ పడడం విచిత్రం. ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ స్టామినా మహిమే అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. కొత్త సినిమాలు విడుదల అవుతుండడం వల్ల ఈ చిత్రానికి థియేటర్స్ దక్కుతాయో లేదో అనే భయం ఫ్యాన్స్ లో ఉంది. కానీ భారీ రిలీజ్ కి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఆల్ టైం రికార్డుని నెలకొల్పుతుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
యాంకర్ వర్షిణి ఎవరితో ప్రేమలో ఉందో తెలుసా ? ఇన్నాళ్లకు వెలుగులోకి..!
జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. అవార్డులు పొందిన నటులు వీళ్లే..!