ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఇంత విజయవంతంగా కొనసాగుతోంది అంటే దాని వెనక అలనాటి నటి నటుల కష్టం ఎంతో ఉందని చెప్పవచ్చు. కనీసం సినిమా అంటే తెలియని సమయంలోనే ప్రజలకు సినిమాలను పరిచయం చేసి ఎంతో కష్టపడి ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళిన కొంతమంది స్టార్ నటీనటుల గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం..? సినిమా అంటే తెలియని తొలినాళ్లలోనే ఎంతోమంది చిత్రసీమలోకి వచ్చి నటులుగా పేరు సంపాదించుకోవడం మనం చూశాం. ఇందులో ఒకరు పద్మశ్రీ చిత్తూరు నాగయ్య. ఆయన తన నటనతో ఎంతో కష్టపడి ఎంతో మంది అభిమానులను సంపాదించారు. ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం.1904 మర్చి 28న జన్మించారు నాగయ్య. ఆయన చదువు పూర్తి చేశాక కొన్ని రోజులు ఒక ప్రభుత్వ ఆఫీసులో క్లర్క్ గా చేశారు. దీని తర్వాత ఆంధ్ర పత్రిక తరఫున జర్నలిస్టుగా చేరారు. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ భావాలని ఎంతో ఇష్టపడే నాగయ్య వారి అడుగుజాడల్లో నడిచి డిండి ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ నటన పైన ఉన్న ఆసక్తితో 1938లో గృహలక్ష్మి అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేశారు నాగయ్య. నటుడిగా మొదటి సినిమాతోనే ఎంతో పేరును సంపాదించారు. అక్కడి నుంచి ఆయన తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వందేమాతరం, సుమంగళి, దేవత, మోహిని వంటి అనేక చిత్రాల్లో చేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అప్పట్లోనే ఆయన అశోక్ కుమార్, మీరా, చక్రధారి వంటి తమిళం సినిమాల్లో కూడా నటించారు. ఆయన కేవలం నటుడుగానే కాకుండా సంగీత దర్శకుడిగా, సింగర్ గా, నిర్మాతగా, రచయితగా కూడా చాలా సినిమాల్లో చేశారు. ఆయన చేసిన రామదాసు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా ఆ సమయంలో జాతీయ అవార్డు వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పూర్తిగా చిత్రసీమలో పేరు తెచ్చుకోక ముందే నాగయ్య ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. ఆ సమయంలోనే లక్ష రూపాయల పారితోషికం అందుకున్న ఏకైక నటుడు నాగయ్య. అలనాడు నాగయ్య ను చాలామంది తొలితరం సూపర్ స్టార్ అని కీర్తించారు.
Advertisement
also read;
Advertisement