టాలెంట్ ఉండాలే కానీ ఏదైనా సాధించగలమని కొంతమందిని చూస్తే అనిపిస్తుంది.. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంగ్లీ ఒక్కసారిగా స్టార్ అయిపోయింది.. గొంతుతో ఎంతటి వారినైనా మెస్మరైజ్ చేసే స్థాయికి ఎదిగింది.. సినిమాలో మంగ్లీ పాట ఉంది అంటే ఆ సాంగ్స్ సూపర్ హిట్.. అంత మధురమైన, మాస్ కలగలిపిన గొంతు ఆమెది. ఎక్కడో ఐదు వేల రూపాయల నెల జీతం తీసుకునే ఆమె v6 ఛానల్ ద్వారా తీన్మార్ న్యూస్ లో ఎంట్రీ ఇచ్చి సరికొత్త లంబాడా లుక్కుతో తన మాటలతో ఎంతోమందిని అదరగొట్టేసింది. ఈ సమయంలోనే ఆమె లో దాగి ఉన్న సంగీతం టాలెంట్ ను బయటపెట్టేసింది.
Advertisement
also read:“పొన్నియన్ సెల్వన్” సినిమా రివ్యూ…..!
ఆ సమయంలో ఆమెకు నెలకు పదివేల రూపాయల జీతం ఇచ్చేవారట. ఈ విధంగా మళ్లీ తన టాలెంట్ తో తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ తరుణంలోనే ఆమె పాటలు ఒక్కొక్కటిగా సక్సెస్ అవడంతో , మంగ్లీ కి ఒక హీరోయిన్ కు ఉండే స్థాయి దక్కింది. ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా తన పాటల ప్రస్థానం మొదలుపెట్టిన మంగ్లీ తన పాటల మాధుర్యంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది.. ఈ తరుణంలోనే సినిమా అవకాశం రావడంతో ఆమె పాడిన పాటలు సక్సెస్ అయ్యాయి.
Watch our Radha dance for her Krishna #Brindavanam full video song► https://t.co/qaRJ7WmtlH
Advertisement
🎶@ThisIsDSP
🎤@iamMangli
🖋️ #Suddalaashokteja #RowdyBoys #Ashish @anupamahere @HarshaKonuganti @Madhie1 @SVC_official #sahidevvikram #karthikrathnam #tejkurapati @komaleeprasad pic.twitter.com/ekzTeXnY1t— Aditya Music (@adityamusic) February 10, 2022
దీంతో చిన్న హీరో నుంచి స్టార్ హీరోల వరకు మంగ్లీ పాటలు సినిమాలో తప్పకుండా పెట్టుకోవాలి అనే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం మంగ్లీ ఒక పాట పాడితే ఐదు లక్షల పైనే తీసుకుంటుందట.. ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. యూట్యూబ్ లో ఆమె ఒక వీడియో పోస్ట్ చేస్తే మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చి ఆ విధంగా కూడా చాలా సంపాదిస్తోంది. ఇంతలా మంగ్లీ సక్సెస్ అయింది అంటే దానికి ప్రధాన కారణం ఆమె లో ఉన్న ఆత్మవిశ్వాసం, నటన టాలెంట్.. హాట్సాఫ్ టూ మంగ్లీ అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
also read: