మన దేశం లో అనేక గ్రామాలలో అనేక రకమైన ఆచారాలు ఉంటాయి. కొన్ని వినడానికి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మరి కొన్ని ఆచారాలు ఆసక్తి గా ఉండవు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రామం లో ఉన్న ఆచారం మాత్రం చాలా వింత గా ఉంది. ఈ వింత ఆచారం గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లా లోని తాడేపల్లి గూడెం మండలం జగన్నాధపూరం లో నే ఈ వింత ఆచారం ఉంది. ఈ ఆచారం ప్రకారం నూతన పెళ్లి చేసుకునే వధు వరులు వేసుకునే అలంకరన ఇక్కడ ప్రత్యేకం గా ఉంటుంది.
Advertisement
Advertisement
ముఖ్యం గా వరుడు వేసుకునే అలంకరణ ను అందరూ షాక్ అవుతారు. నూతనం గా పెళ్లి చేసుకునే వరుడి ని అచ్చం వధువు లాగే అలంకరిస్తారు. పట్టు చీర తో పాటు బంగారు అభరణలు కూడా అలంకరిస్తారు. అంతే కాకుండా.. అలా అలంకరించిన వరుడిని ఒక రథం పై ఊరంత ఊరేగిస్తారు. అలాగే వధువు చేసే పలు కార్యక్రమాల ను కూడా వరుడి తో నే చేయిస్తారు. ఈ ఆచారం ఇప్పటి కి కూడా అమలు చేస్తున్నారు.
అలాగే వధువు ను కూడా వరుడి లాగే అలంకరిస్తారు. అలాగే వరుడి లా అలంకరించిన వధువు ను గుర్రం పై ఊరేగిస్తారు. అలాగే ఆ గ్రామం లో ఉన్న దేవతల వద్ద కూడా పూజలు నిర్వహిస్తారు. అలాగే వధువు ను గ్రామా దేవత ల వద్ద కు చీర లను కింద పరిచి వాటి పై న నడిపిస్తారు. అయితే ఈ గ్రామంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నాయి. అయితే ఈ ఆచారం పూర్వికుల నుంచి రావడం తో తాము కూడా పాటిస్తున్నామని ఆయా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.