ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు కానీ కొన్ని కొన్ని సార్లు పెళ్లి చేసుకుని తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు రావడం, ఏదో ఒక ఇబ్బంది రావడం, విడిపోవడమే మంచిది అని అనుకోవడం ఇటువంటివి జరుగుతున్నాయి. సాధారణంగా జీవిత భాగస్వామితో చిన్నచిన్న గొడవలు వస్తూ ఉంటాయి. కానీ అడ్జస్ట్ అయిపోతూ ఉంటే బంధం బాగుంటుంది. అయితే పెళ్లి చేసుకునే వాళ్లకు ఇలాంటి లక్షణాలు ఉంటే చాలా కష్టం.
Advertisement
కాబట్టి ఎటువంటి లక్షణాలు లేకుండా చూసుకోవాలి..? కొంతమంది ఏం చెప్పినా కూడా వినరు. వారి ఇష్టాలతోనే అన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి మాటే నెగ్గాలని అనుకుంటుంటారు. అటువంటి వాళ్ళ వలన భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. కొన్ని కొన్ని సార్లు కొన్ని విషయాల్లో ఒత్తిడిని తీసుకొచ్చే వాళ్లు కూడా ఉంటారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, లేదంటే చిన్న చిన్న విషయాలకే తట్టుకోలేకపోతూ ఉంటారు.
Advertisement
అన్ని వాళ్ళు చెప్పేది చేయాలని అనుకుంటారు. స్వేచ్ఛ ఇవ్వరు. ఇటువంటి వాళ్లతో జీవితం కష్టం. కొంతమంది ఎక్కువగా అసూయ పడుతూ ఉంటారు వీళ్ళ వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. ఇటువంటి వాళ్లకి కూడా దూరంగానే ఉండాలి. పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. ఏదైనా రిలేషన్ లో ఉండాలంటే ముందు మీ పార్టనర్ ని గమనించి వాళ్లు మీకు సెట్ అయితేనే ముందుకు వెళ్ళండి లేదంటే వాళ్లకి దూరంగానే ఉండడం మంచిది ముందు నుండే వీటి గురించి మాట్లాడితే ఒత్తిడి టెన్షన్ వంటివి ఉండవు ఫ్యూచర్ లో కూడా సమస్యలు ఉండవు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!