ఓ డాక్టర్ కొత్తగా ఇళ్లు కొనుక్కొని, చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఓ ఫైన్ మార్నింగ్ లేచి చూసేసరికి సింక్ ట్యాప్ ఓపెన్ చేసి నీరు వృథాగా పోవడాన్ని గమనించాడు. ఈ తర్వాతి నుండి ప్రతి రోజూ పడుకునే ముందు అన్ని ట్యాప్ లను జాగ్రత్తగా ఆఫ్ చేసి పడుకునేవాడు. అయినా హాల్ లో ఉన్న ట్యాప్ మాత్రం తెల్లారే సరికి ఓపెన్ చేసే ఉండేది. నీరు వృథాగా పోతూనే ఉండేవి. రాత్రి ట్యాప్ ఎవరు ఓపెన్ చేస్తున్నారు? ఇంట్లో ఉండేది నేనొక్కడినే కదా! అనే అనుమానంతో భూత వైద్యుడిని సంప్రదించాడు.
Advertisement
Advertisement
అతడు ఇంట్లో ప్రేతాత్మ ఉంది దాన్ని పంపించడానికి 20 వేలు అవుతాయన్నాడు. ఇలా కాదని వాస్తుశాస్త్రం బాగా తెల్సిన ఓ పండితుడి దగ్గరికి వెళ్తే ఇంట్లో వాస్తు దోషముంది. నివారణకు హోమం చేయాలి… హోమం ఖర్చు 25 వేలు అన్నాడు.
ఇలా కాదు అసలు ఏం జరుగుతుందో చూద్దామని ఇంట్లో CC కెమెరాలను పెట్టించాడు! నెక్ట్స్ డే మార్నింగ్ CC కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను చూసి ఖంగు తిన్నాడు. ఆత్మ కాదు ప్రేతాత్మ కాదు. ఓ చిట్టెలుక! హా ఓ ఎలుక వచ్చి ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు తాగి వెళ్లిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. క్లియర్ గా ఈ సంఘటన గుడ్డిగా నమ్మొద్దు, హేతుబద్దంగా ఆలోచించాలనే సూటి విషయాన్ని క్లియర్ గా చెబుతోంది!