రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ల పార్టీని గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పలు కామెంట్స్ చేశారు. ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోవడం కచ్చితం అని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చాక సీన్ మారిపోయిందని అన్నారు.
Advertisement
Advertisement
ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడబోతున్నారని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభ్యర్థులు మార్చిన టిడిపి జనసేన ఓటు బ్యాంకు చెక్కుచెదరదని అన్నారు. వైసిపి షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఓటింగ్ శాతం సున్నా నుండి 10 శాతానికి పెరిగిందని అన్నారు. ప్రభుత్వ మార్పు కచ్చితంగా భీమిలి సభ తోనే తెలిసిందని అన్నారు మూడు లక్షల మంది సభకి హాజరవుతారని వైసిపి నాయకులు అంటే 30,000 మంది కూడా హాజరు కాలేదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!