ప్రతి ఒక్కరికి కూడా, ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య నుండి, బయటపడడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. సమస్యల్ని బయటపడటం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరు కూడా మంచే జరగాలని అనుకుంటుంటారు. కానీ, అందరికీ అది సాధ్యం కాదు. మీ సమస్యలు తీరిపోవాలన్నా కోరికలు నెరవేరాలన్నా ఇక్కడ వినాయకుడికి ఉత్తరం రాయండి. ఏ దేవుడిని పూజించాలన్న మొట్టమొదట మనం వినాయకుడిని పూజించాలి. వినాయకుడి పూజించిన తర్వాత మిగిలిన ఏ దేవుళ్ళకైనా మనం పూజ చేయాలి. ఇక్కడ భక్తులు కోరికలు తీరడానికి వినాయకుడికి ఉత్తరం రాస్తారు. ఇక ఈ దేవాలయం గురించి ఇక్కడ భక్తులు పాటించే పద్ధతి గురించి మనం చూద్దాం.
Advertisement
Advertisement
రణథంబోర్లో కొలువై ఉన్న విఘ్నేశ్వరుడు భక్తులు కోరిన కోరికలను తీర్చుతారు. కోరికలను తీర్చే ఇష్ట దైవంగా చెబుతారు. అన్ని దేవాలయాల్లోనూ భక్తులు దేవుడు ఎదుట నిలబడి కోరికలు చెబుతారు. కానీ ఇక్కడ ఉత్తరాలు రాస్తారు. వినాయకుడికి కృతజ్ఞతలు చెబుతూ కూడా ఇక్కడ భక్తులు ఉత్తరాలు రాస్తారు. ఆలయానికి నిత్యం దాదాపు 20 కేజీలకు పైగా ఉత్తరాలు వస్తాయి.
వాటన్నింటినీ పూజార్లు ఓపిగ్గా చదువుతారు. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దం లో హమీర్ రాజు నిర్మించాడని అంటారు. ఆ కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనే రాజుతో యుద్ధం జరిగినప్పుడు హమీర్ రాజ్యంలోని ఖజానాలో ఉన్న సామగ్రి తుడిచి పెట్టుకుపోయిందట. 7 ఏళ్లు యుద్ధం జరిగింది. హమీర్ తనకు ఓటమి తప్పదని అనుకున్నాడు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!