Home » World Cup 2023: టీమిండియాకు మరో షాక్… బుమ్రా బౌలింగ్ లో గాయపడి ఆస్పత్రి పాలైన స్టార్‌ ప్లేయర్‌..!

World Cup 2023: టీమిండియాకు మరో షాక్… బుమ్రా బౌలింగ్ లో గాయపడి ఆస్పత్రి పాలైన స్టార్‌ ప్లేయర్‌..!

by Bunty
Ad

2023 వన్డే వరల్డ్ కప్ లో విశ్వవిజేత అవ్వడానికి మరికొన్ని మ్యాచ్ ల దూరంలో ఉంది భారత జట్టు. ఇప్పటికే 8 మ్యాచ్లు ఆడి అన్ని మ్యాచ్ లలో విజయాన్ని సాధించిన టీం ఇండియా ఇప్పుడు చివరి మ్యాచ్ కోసం రెడీ అవుతుంది. నెదర్లాండ్స్ తో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బెంగళూరు చేరిన టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత్ తీవ్రంగా కష్టపడుతోంది. ఈ ప్రాక్టీస్ లో టీమ్ ఇండియా మిడిలార్డర్ ప్లేయర్ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు.

Advertisement

నెదర్లాండ్ మ్యాచ్ కు అతను ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న ఇషాన్ కిషన్ బూమ్రా బౌలింగ్ లో గాయపడ్డాడు. బుమ్రా వేసిన బంతి ఇషాన్ కిషన్ కడుపుకు బలంగా తాకింది. దాంతో నొప్పితో కింద పడిపోయాడు కిషన్. దాంతో ప్రాక్టీస్ నుంచి తప్పుకున్నాడు. అతనికి తగిలిన గాయం పెద్దది కాదని తెలుస్తోంది. సెమీస్ కు సమయం దగ్గర పడుతుంది. కాబట్టి టీం లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ ఫిట్ గా ఉండడం చాలా ముఖ్యం.

Advertisement

ఈ మెగా టోర్నిలో రెండు మ్యాచ్లు ఆడిన ఇషాన్ మరో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి చివరి మ్యాచ్ లో అతనికి ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది చూడాలి. వరల్డ్ కప్ లో అపజయం లేని జట్టుగా ఉన్న భారత్ అదే జోరుతో నెదర్లాండ్స్ మీద గెలిచి సెమీస్ కు వెళ్లాలని చూస్తోంది. సౌత్ ఆఫ్రికా లాంటి పెద్ద టీంను ఈ మెగా టోర్నీలో ఓడించింది డచ్ టీం. కాబట్టి తక్కువ అంచనా వేయకుండా సమిష్టి ప్రదర్శన చేస్తే టీమిండియాకు మరో విక్టరీ దక్కుతుంది.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading