ఇండస్ట్రీలో చాలామంది హీరోలు నటులుగా నిలదొక్కుకోవడానికి అనేక ఆపసోపాలు పడ్డారు. ఎంతో కష్టపడి స్టార్ హీరోగా మారారు. అలాంటి హీరోలు ఇండస్ట్రీకి రాకముందు కొంతమంది బిజినెస్ లు చేస్తే మరి కొంత మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు. అయితే వారు చేసిన పనులను కొన్ని కొన్ని ఇంటర్వ్యూలలో వారే బయట పెడుతూ ఉంటారు. అలా ఇండస్ట్రీలోకి రాకముందు ఈ స్టార్ హీరోలు ఏం పని చేసేవారో ఇప్పుడు చూద్దాం..
గోపీచంద్ :
Advertisement
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాల్లోకి రాకముందు న్యూస్ రీడర్ గా పనిచేసేవారట. అది కూడా తెలుగు ఈటీవీ ఛానల్ లో చేశారట.
నాని:
మన తెలుగు న్యాచురల్ స్టార్ హీరో నాని హీరోగా రాకముందు శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.
also read:Yashoda movie twitter review: యశోద మూవీ రివ్యూ.. మరో హిట్టు పడ్డట్టేనా..?
రజనీకాంత్ :
ఇండియా మొత్తం సూపర్ స్టార్ గా అందరికీ సూపరిచితమైన రజినీకాంత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకు ముందు బస్ కండక్టర్ గా పని చేసేవారు.
రాహుల్ రవీంద్రన్:
Advertisement
తెలుగు ఇండస్ట్రీకి చెందిన మరో హీరో రాహుల్ రవీంద్రన్. ఈయన కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించారు. ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు లీడింగ్ మీడియా కంపెనీలో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్ గా పని చేశారు.
మోహన్ బాబు :
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి సీనియర్ హీరో మోహన్ బాబు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా మారారు. ఇండస్ట్రీలోకి రాకముందు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు.
సుధీర్ బాబు:
హీరో సుధీర్ బాబు అందరికీ పరిచయమే. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ హీరోగా ఎదగలేక పోయారు. ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు బ్యాట్మెంటన్ ప్లేయర్ గా కొనసాగారు.
రాజశేఖర్:
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరో సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.. ఈయన ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టకముందు డాక్టర్ గా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే.
also read: