కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ షరవేగంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 80 శాతం మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయగా ప్రస్తుతం సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభణ మొదలై రెండేళ్లు అవుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Advertisement
మరోవైపు ఇప్పటివరకు కరోనా మహమ్మారికి సరైన మందు అంటూ లేదు. దాంతో కరోనా పట్ల అప్రమత్తతే అసలైన వైద్యం అని నిపుణులు చెబుతున్నారు. కరోనా రాకుండా మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, సామాజిక దూరం లాంటివి పాటించడం చేయాలని చెబుతున్నారు. మరోవైపు కరోనా సోకకుండా ఉండాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలని వైరస్ నుండి రక్షించుకోవడానికి అది ఒక్కటే మార్గం అని కూడా చెబుతున్నారు. ఇక కొంతమంది వ్యాక్సిన్ కు భయపడుతుంటే మరికొంతమంది ధైర్యంగా ముందుకు వెళ్లి వ్యాక్సిన్లు వేసుకుంటున్నారు. అలా వ్యాక్సిన్ లు వేసుకుంటున్న సమయంలో కొన్ని వింతలు కూడా జరుగుతున్నాయి.
Advertisement
ఇక తాజాగా మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం మల్కలపేట్ గ్రామంలోని వ్యాక్సిన్ సెంటర్ లో రాజవ్వ అనే మహిళ కోవాక్సిన్ వాక్సిన్ వేసుకుంది. అయితే వ్యాక్సిన్ వేయగానే రాజవ్వకు ఒక్కసారిగా పూనకం వచ్చింది. ఆమె పూనకంతో ఊగిపోవడం తో అక్కడ ఉన్న సిబ్బంది అంతా ఒక్కసారిగా షాకయ్యారు. సాధారణంగా దేవుని ఆలయాల్లో జాతరలో మహిళలకు పూనకాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పూనకం రావడం ఇదే మొదటిసారి. అయితే ఇది భయంతో వచ్చిందేమోనని కొంతమంది భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.