ఒకప్పుడు సహజీవనం అంటే వింతగా చూసేవాళ్లు కానీ ఇప్పుడు సహజీవనం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. అంతే కాకుండా సహజీవనం ను కూడా కామన్ గా చూస్తున్నారు. కాగా తాజాగా ఓ మహిళ తన సహజీవనం అనుభవాలను మీడియాతో పంచుకుంది. తమిళనాడుకు చెందిన కవితా గజేంద్రన్ మొదట ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ తరవాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
Advertisement
ఆ తరవాత కవితా గజేంద్రన్ పెళ్లి చేసుకోకూడదని నిర్నయం తీసుకుంది. అయితే జీవితంలో ఓ తోడు కావాలి కాబట్టి రాజ సంగీతన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. కవితా వామపక్ష రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తోంది. రాజ సంగీతన్ కూడా వామపక్షరాజకీయాల్లోనే పనిచేయడంతో తో పాటూ ఆయన మంచి రచయిత. ఇక ఓ ఇంటర్వ్యూలో కవితా మాట్లాడుతూ… స్వేచ్చ స్వతంత్య్రాలు కట్టడి చేయలేని బంధం కోసమే సహజీవనం నిర్నయం తీసుకున్నానని చెప్పింది.
Advertisement
తాను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చానని తెలిపింది. ఇంట్లో ఒత్తిడి వల్ల 25 ఏళ్ల వయసులో తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తను చెడ్డవాడు కాదని కానీ కుటుంబం సమాజం వల్ల తనపై ఆంక్షలు విధించాడని చెప్పింది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మూడేళ్లకే విడాకులు తీసుకున్నామని చెప్పింది.
ఆ తరవాత సోషల్ మీడియాలో రాజ సంగీతన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని అతడితో నా భావాలు ఒకేలా ఉండటం వల్ల ఇద్దరం కలిసి ఉండాలని నిర్నయం తీసుకున్నామని చెప్పింది. వివాహం అందించలేని అవగాహన సహజీవనం అందించిందని చెప్పింది.
ALSO READ : నటి శ్రీలక్షి తండ్రి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రేంజ్ హీరో అన్న సంగతి తెలుసా..? ఆయన ఎవరంటే..?