ఇండియన్ టీమ్ లో సీనియర్ క్రికెటర్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ప్రస్తుతం టెస్ట్, వన్డే ఫార్మాట్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్లో మొన్నటివరకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా నడిపించాడు. రోహిత్ నాయకత్వంలో ముంబై ఐదుసార్లు ట్రోఫీని గెలిచింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి ముందు అనూహ్యంగా రోహిత్ ను తప్పించి హార్దిక్ కు జట్టు పగ్గాలు అందించారు. దీంతో రోహిత్ ప్రస్తుతం టీమిండియాకు టెస్ట్ మరియు వన్డే క్రికెట్ కు మాత్రమే సారధిగా వ్యవహరిస్తున్నాడు. గత కొంతకాలంగా వన్డే ఫార్మాట్ కు కూడా రోహిత్ ను తప్పించి యువ రక్తానికి జట్టు పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోంది.
Advertisement
అయితే టీమిండియాను నడిపించే ఆ స్థాయి ఎవరికీ లేకపోవడంతో రోహిత్ నే కొనసాగించాలని అనుకుంది. ఇదిలా ఉంటే పరిమిత ఓవర్ల క్రికెట్ కు సారధిగా వ్యవహరిస్తున్న హార్దిక్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ కూడా గాయం బారినపడ్డాడు. దీంతో ఇప్పుడు టి20 ఫార్మాట్ కు కెప్టెన్ సమస్య ఏర్పడింది. పైగా టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ కు సిద్ధమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరగనున్న టి20 సిరీస్ జూన్ లో జరిగే టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో జట్టు కెప్టెన్ గా ఎవరిని నియమించాలనే విషయంపై బీసీసీఐ సెలెక్టర్లు మరియు నిపుణులతో భేటీని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో టి20 సిరీస్ లకు రోహిత్ పేరు ప్రధానంగా తెరపైకి వచ్చినప్పటికీ అనూహ్యంగా శుబ్ మన్ గిల్ పేరు బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ శుబ్ మన్ గిల్ జట్టు బాధ్యతలు తీసుకోకపోతే రవీంద్ర జడేజాను కెప్టెన్ ను చేసే అవకాశం కనిపిస్తోంది. నిజానికి వన్డేకు హిట్ మ్యాన్ కెప్టెన్ తాత్కాలికమైనది. ఎందుకంటే రోహిత్ కెరియర్ క్లైమాక్స్ లో ఉంది. మరో కెప్టెన్ ను ఇప్పుడు సెలెక్టర్లు చూసుకోవాల్సిందే. దీంతో శుబ్ మన్ గిల్ ను ట్రై చేయాలని బీసీసీఐ భావిస్తోంది. సీనియర్ రోహిత్, కోహ్లీ జట్టులో ఉన్నప్పుడే శుబ్ మన్ గిల్ ను ట్రై చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలోనే సీనియర్లు ఇచ్చే ఇన్పుట్స్ ని తీసుకుంటూ శుబ్ మన్ గిల్ జట్టును ముందుకు నడిపించగలడని భావిస్తున్నారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.