Home » ప్రియుడి మోజులో భార్య సంచ‌ల‌న నిర్ణ‌యం…చివ‌రికి అలా చేయ‌డంతో..?

ప్రియుడి మోజులో భార్య సంచ‌ల‌న నిర్ణ‌యం…చివ‌రికి అలా చేయ‌డంతో..?

by AJAY
Published: Last Updated on
Ad

ప్ర‌స్తుతం అక్ర‌మ‌సంబంధం వల్ల చాలా కాపురాలు కూలిపోతున్నాయి. అప్ప‌టి వ‌ర‌కూ ఎంతో అన్యోన్యంగా క‌లిసి జీవించిన వారి జీవితాలు నాశ‌నం అవుతున్నాయి. దాంతో అభం శుభం తెలియ‌ని చిన్నారుల జీవితాలు ఆగ‌మ‌వుతున్నాయి. తాజాగా ఓ భార్య ప్రియుడి మోజులో ప‌డి త‌న క‌ట్టుకున్న భ‌ర్త‌నే క‌డ‌తేర్చింది. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే….మైసూరులోని ఘోట‌గిల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న మంజు అనే 37 ఏళ్ల వ్య‌క్తి హ‌* కు గుర‌య్యాడు.

Advertisement

Advertisement

 

మంజుకు లిఖిత‌తో ప‌న్నెండేళ్ల క్రితమే వివాహం జ‌రిగింది. పెళ్లికి ముందే మంజుకు ఓ వ్య‌క్తితో సంబంధం ఉంది. అయితే పెళ్లి త‌ర‌వాత కూడా ఆ సంబంధాన్ని కొన‌సాగించ‌డం మొద‌లు పెట్టింది. అంతే కాకుండా భ‌ర్త బిడ్డ‌ల‌ను వదిలిపెట్టి అత‌డితో వెళ్లిపోయింది. దాంతో కుల పెద్ద‌లు ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదిర్చి కాపురానికి పంపించారు. కానీ లిఖిత ప్ర‌వ‌ర్త‌న లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. భ‌ర్త కుటుంబంతో క‌లిసి ఉన్నా కూడా ప్రియుడితో త‌ర‌చూ ఫోన్ లు మాట్లాడ‌టం క‌ల‌వ‌డం లాంటివి చేసింది.

దాంతో భార్య ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయిన భర్త ఆమెను ప‌లుమార్లు మంద‌లించాడు. దాంతో భ‌ర్త‌ను ఎలాగైనా అడ్డు తొల‌గించుకోవాల‌ని లిఖిత నిర్ణ‌యం తీసుకుంది. ఓ రోజు భ‌ర్త నిద్రిస్తున్న స‌మ‌యంలో ప్రియుడితో క‌లిసి భ‌ర్త గొంతుపిసికి హ‌త‌మార్చింది. మ‌రుస‌టి రోజు ఉద‌యం భ‌ర్త అనారోగ్యంతో మ‌ర‌ణించాడ‌ని ముసలిక‌న్నీరు కార్చింది. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు త‌మ స్టైల్ లో విచారణ మొద‌లుపెట్టారు.

Visitors Are Also Reading