పెళ్లి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాలని పాటించాలి లేకపోతే అనవసరంగా వైవాహిక జీవితంలో ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరు కూడా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. స్త్రీ పురుషులు కలిసి జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు, ఏ సమస్యలు రాకూడదని అనుకుంటారు.
Advertisement
వివాహ బంధం లో సంతోషంగా ఉండాలని, కష్టాలేమి ఉండకూడదని అనుకుంటారు. అయితే ఎప్పుడూ కూడా పెళ్లి తర్వాత ఒకళ్ళే అడ్జస్ట్ అయిపోకూడదు. ఒకరే ప్రేమ చూపించడం వుండకూడదు. ఇద్దరు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఇద్దరు కూడా వైవాహిక బంధాన్ని కాపాడుకోవాలి అయితే పెళ్లి తర్వాత ఎటువంటి విషయాలని కచ్చితంగా భార్య భర్త పాటించాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు చూసేద్దాము.
Advertisement
ఎప్పుడూ కూడా మీ జీవిత భాగస్వామి తల్లిదండ్రులని ఎక్కువగా విమర్శించద్దు. మీరు మీ జీవిత భాగస్వామి తల్లిదండ్రులని తప్పు అని ఎట్టి చూపిస్తే, మీ జీవిత భాగస్వామి బాధపడొచ్చు ఎలా అయితే మీరు బాధ పడతారో వాళ్ళు కూడా బాధపడతారని గుర్తు పెట్టుకోండి. అలానే కుటుంబంలో పగ పెంచుకునే బదులు మీరు ఆనందంగా ఉన్న క్షణాలని మీరు ఎందుకు ఆనందంగా ఉన్నారనే విషయాన్ని మాట్లాడుకోండి. ఎప్పుడూ కూడా వైవాహిక బంధం లో కమ్యూనికేషన్ బాగుండాలి ఇద్దరు కూడా మంచిగా కమ్యూనికేట్ చేసుకుంటే సమస్యలు ఉండవు సరైన కమ్యూనికేషన్ లేక పోతె ఆ బంధం పాడవుతుంది.
కాబట్టి కమ్యూనికేషన్ తో మీ బంధాన్ని బలంగా మార్చుకోండి. అలానే మీ భావాలను కూడా ఎక్స్ ప్రెస్ చేస్తూ ఉండాలి ఎప్పుడైనా నెగటివ్ గా ఎక్స్ ప్రెస్ చేస్తే పరిస్థితి గొడవగా మారే అవకాశం ఉంటుందని గుర్తు పెట్టుకోండి అలానే అప్పుడప్పుడు అడ్జస్ట్ అవ్వడం చాలా ముఖ్యం. ప్రతి చిన్న విషయాన్ని సాగదీసుకుంటూ గొడవ పెట్టుకున్నట్లయితే మీ బంధం పాడయ్యే అవకాశం ఉంది గొడవలు వస్తాయి ఇలా ఈ విషయాలను కనుక మీరు పాటించినట్లయితే మీ బంధం బాగుంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!