జీవితంలో ఎమోషన్స్ లేకపోతే బ్రతకలేం. ఎమోషన్స్ లేనట్టయితే ఏ బంధం కూడా నిలబడదు. అదే విధంగా జీవితంలో ఏ ఎమోషన్ ఎక్కువైనా కష్టమే. ప్రేమ, కోపం, బాధ, కేరింగ్ ఇలా ఏ ఒక్కటి ఎక్కువైనా అది నష్టాన్నే కలగజేస్తుంది. కాగా ప్రేమ ఎక్కువైతే భార్య భర్తల మధ్య గొడవలు ఏర్పడే అవకాశం ఉందని మానసిక నిపుణలు చెబుతున్నారు.
Advertisement
ఇటీవల ఓ భార్య తన భర్త తనను అతిగా ప్రేమిస్తున్నాడని చెప్పి ఆరోపిస్తూ కోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకున్న ఘటన అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. తన భర్త చూపించే కేరింగ్ తనకు టార్చర్ లా అనిపిస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. ఇక భర్తలను అతిగా ప్రేమిస్తే కూడా సమస్యలు వస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎక్కడైతే అతి ప్రేమ ఉంటుందో అక్కడే ద్వేషం మొదలవుతుందని బెబుతున్నారు.
Advertisement
అతి ప్రేమ వల్ల భర్తలపై అనుమానం కూడా మొదలవుతుందని అంటున్నారు. అతిగా ప్రేమిస్తే పరాయి స్త్రీతో మాట్లాడినా కూడా అనుమానం వ్యక్తం చేస్తారని చెబుతున్నారు. కాబట్టి అతి ప్రేమ అనేది ఎవరికీ మంచిది కాదంటున్నారు. ఎవరికైనా వ్యక్తి గత స్వేచ్చ ఉండాలని కాబట్టి అతి ప్రేమ చూపిస్తే వారికి స్వేచ్చ ఉండదని చెబుతున్నారు.
స్చేచ్చ లేకపోతే వారికి భార్యల పై చిరాకు విసుగు వస్తాయని చెబుతున్నారు. అలా జరిగితే ప్రేమ విషయం పక్కన పెడితే గొడవలు మొదలవుతాయని చెబుతున్నారు. భర్తలను ప్రేమించాలని కానీ మిమ్మల్ని మీరు కూడా ప్రేమించుకోవాలని చెబుతున్నారు. ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపాలని కాబట్టి ఏదైనా మితంగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారరి చెబుతున్నారు.
ALSO READ:భార్య తన భర్తని ఇలా చూసుకుంటే మరొకరివైపు అస్సలు చూడడట..!