ఈరోజుల్లో వైవాహిక జీవితంలో చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెళ్లి తర్వాత ఏడాదికో రెండేళ్లకో భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, విడిపోవడమే మంచిదని విడాకులు తీసుకోవడం వంటివి ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. భార్య, భర్త మధ్య గొడవలు అయినప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. ఒక్కొక్కసారి గొడవ పెద్దదిగా అయిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితిని మీరు కంట్రోల్ చేయలేక పోతే కాసేపు పక్కకు వెళ్లడం మంచిది. అంతా సర్దుకున్నాక మళ్ళీ తిరిగి మీరు రావడం మంచిది. ఎవరికి కూడా ఎక్కువ కోపం ఉండడం మంచిది కాదు.
Advertisement
రిలేషన్ షిప్ లో పార్ట్నర్ కోపంగా ఉన్నప్పుడు మనం కూడా అదే విధంగా కోప్పడడం వలన పరిస్థితిని మార్చలేము. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. గొడవలప్పుడూ చాలామంది ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అలా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్ట్నర్ హర్ట్ అవ్వచ్చు కాబట్టి ఒకరికి బాధ కలిగించే వాటిని అనడం మంచిది కాదు. గొడవ పడినప్పుడు ఏవేవో పనులు చేయడం, మాటలు అనడం చేస్తుంటారు. దీనివలన సమస్య సర్దుకోదు.
Advertisement
ఎదుటి వాళ్ళని ఓదార్చండి. వీలైతే పరిస్థితి మళ్ళీ రానివ్వకుండా చూడాలి. ఎప్పుడైనా సరే గొడవ వచ్చినప్పుడు సమస్య ఏంటి దానిని ఎలా పరిష్కరించాలి అనే దాని గురించి మాట్లాడండి. భవిష్యత్తులో అటువంటి సమస్యలు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడండి ఇలా భార్యాభర్తలు గొడవల సమయంలో వీటిని ఆచరించినట్లయితే, కచ్చితంగా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు రావు సంతోషంగా భార్యాభర్తలు ఉండవచ్చు. పొరపాటున కూడా భార్యాభర్తల మధ్య గొడవ అయినప్పుడు ఈ తప్పులు చేయకూడదు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి