Home » Ramcharan-Upasana: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది

Ramcharan-Upasana: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది

by Bunty
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా కోడలు ఉపాసన నిన్న తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో మెగా కోడలు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిన్న ఉదయం ఒకటి గంటల 40 నిమిషాలకు… మెగా ప్రిన్సెస్ జన్మించింది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి మీడియా ముందు చెప్పారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసనలు తల్లిదండ్రులు కావడంతో… మెగా కుటుంబంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమ ఇంట్లో ఆడబిడ్డ పుట్టినట్లు మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

ఇది ఇలా ఉండగా తాజాగా ఉపాసనకు పుట్టిన బిడ్డ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తనకు పుట్టిన పాప బొడ్డుతాడు రక్తాన్ని ఓ ప్రైవేటు సంస్థ వద్ద సేఫ్ గా ఉంచినట్లు ఉపాసన తాజాగా ట్వీట్ చేసింది. బొడ్డు తాడు రక్తం భద్రపరచడం అంటే… అంబిలికల్ కార్డు బ్లడ్ అని అర్థం. అయితే ఈ బొడ్డుతాడు రక్తం భద్రపరచడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు బొడ్డుతాడు అంటే ఏంటో వివరాల్లోకి వెళితే… తల్లి కడుపులోని బిడ్డ బొడ్డును ప్లసెంటా తో బొడ్డుతాడు అనుసంధానిస్తుంది. దీని ద్వారానే పుట్టబోయే బిడ్డకు ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ అందుతాయి. ఇక… కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చినప్పటికీ.. బొడ్డుతాడు ద్వారా బిడ్డ ప్లసేంటా కు అనుసంధానమై ఉంటుంది. బిడ్డను ప్లసెoటా నుంచి వేరు చేయడానికి బొడ్డుతాడును కత్తిరించి ముడి వేస్తారు. దీన్నే అంబిలికల్ కార్డు క్లిప్పింగ్ అని అంటారు.

Advertisement

ఆ ముడి అనంతరం బిడ్డ బొడ్డుకు అనుసంధానమై ఉండే మిగిలిన చిన్న బొడ్డు తాడు.. ఐదు నుంచి 15 రోజుల్లో ఎండిపోయి నల్లగా మారుతుంది. ఆ తర్వాత దానికదే ఊడిపోతుంది అన్నమాట. ప్రసవం అనంతరం బొడ్డుతాడు, ప్లసెంటా లలోని మూల కణాలను భద్రపరచడాన్ని కార్డు బ్లడ్ బ్యాంకింగ్ అని అంటారు. ఈ కణాలను లుకేమియా, తలేమియా, మాయ లోమాస్, లింపోమా లాంటి వ్యాధులలో ఉపయోగిస్తారట. ఇక ఒకసారి బొడ్డుతాడు, ప్లసెంటాల నుంచి రక్తాన్ని సేకరించిన తర్వాత దాన్ని వీలైనంత వేగంగా లేబరేటరీలకు తరలిస్తారు. అక్కడ సరైన ఉష్ణోగ్రతల మధ్య నిలువ చేస్తారు. ఇలా భద్రపరచడానికి ఎంత ఖర్చవుతుందో ఒకసారి తెలుసుకుందాం. బొడ్డుతాడు లోని రక్తాన్ని భద్రపరిచేందుకు ఒక్కో సంస్థ ఒక్కోలా డబ్బులు తీసుకుంటుంది. 25 ఏళ్లు భద్రపరచడానికి సాధారణంగా 55 వేల రూపాయలు తీసుకుంటారట. అలాగే 75 సంవత్సరాలకు అయితే ఏకంగా 70 వేల రూపాయలు వసూలు చేస్తారట.

ఇవి కూడా చదవండి

సౌందర్య వేలకోట్ల ఆస్తులు ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే…!

భార్య పరాయి మగాడిపై ఆశపడటానికి కారణం ఇదే!

టాలీవుడ్ హీరోస్ తీసుకున్న వరకట్నాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….!

Visitors Are Also Reading