ప్రస్తుతం దేశంలోనే టాప్ దర్శకుడిగా రాజమూలి ఎదిగారు. బాహుబలి సినిమాతో రాజమౌలి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు కథను అందిస్తుంది మాత్రం ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేసిన బజరంగీ బాయ్ జాన్ సినిమాకు కూడా విజయేంద్రప్రసాదే కథను అందించారు.
అంతే కాకుండా ఒకప్పుడు టాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేసిన ఘరానా బుల్లోడు, సమరసింహారెడ్డి సినిమాలు సహా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథను అందించారు. అయితే రచయితగా ఎంతో సక్సెస్ చూసిన విజయేంద్రప్రసాద్ దర్శకుడిగా మాత్రం ఓడిపోయారు. దానికి గల కారణాలను విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
విజయేంద్రప్రసాద్ ఇప్పటి వరకూ దర్శకుడిగా మూడు సినిమాలు చేశారు. శ్రీకృష్ణ 2006 అనే సినిమాకు విజయేంద్రప్రసాద్ మొదటగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కమర్షియల్ హీరో నటించి ఉంటే హిట్ అయ్యి ఉండేదని అన్నారు. సినిమాలో రవితేజ హీరోగా నటిస్తానని చెప్పారని కానీ నిర్మాత శ్రీకాంత్ తో కానిచ్చేద్దామని అన్నట్టు తెలిపారు. శ్రీకాంత్ ఏమీ తక్కువ కాదని కాకపోతే స్టార్ హీరో ఉండి ఉంటే బాగుండేదని అన్నారు.
శ్రీవల్లి సినిమాను తమన్నా హీరోయిన్ గా పెట్టితీసుంటే 12 కోట్లు కోట్లు పెట్టికొనేవాడినని ఓ నిర్మాత అన్నారని చెప్పారు. కానీ ఆ సినిమా తనకు దర్శకుడిగా సంతృప్తిని ఇచ్చిందని విజయేంద్రప్రసాద్ అన్నారు. ఇక నాగార్జున హీరోగా నటించిన రాజన్న సినిమా కూడా తనకు సంతృప్తిని ఇచ్చిందని ఆ సినిమా ఎందుకు హిట్ అవ్వలేదో తనకు తెలియదని అన్నారు. ఫ్యూచర్ లో మరో సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తానని చెప్పారు. మరి ఈ సినిమా అయినా అనుకున్నమేర విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
Also Read: మంచులక్ష్మి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా…!