తమిళ సీనియర్ స్టార్ హీరో విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో చెన్నై లో ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కనుముసారు. ఆ విషయం తెలుసుకున్న తమిళం తో పాటుగా తెలుగు ప్రజలు కూడా సంతాపాన్ని వ్యక్తపరిచారు. అతి తక్కువ మంది సమక్షంలో శుక్రవారం విజయ్ కాంత్ అంత్యక్రియలు జరిగాయి. ఆయన కొడుకుకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ కాంత్ జనవరి 31వ తేదీన 1990లో ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు పెద్దకొడుకు విజయ ప్రభాకర్ రెండవ కొడుకు షణ్ముఘ పాండియన్. రెండవ కొడుకు షణ్ముగ సినిమా రంగంలోకి అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించాడు. పెద్దకొడుకు పొలిటిషన్ గా కొనసాగుతున్నాడు.
Advertisement
Advertisement
అయితే విజయ్ కాంత్ పెద్దకొడుకు విజయ ప్రభాకర్ కి 2019లో కోయంబత్తూర్ కి చెందిన ఒక వ్యాపారవేత్త కూతురుతో నిశ్చితార్థం జరిగింది. అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ జరిగి నాలుగేళ్ల అవుతోంది. కానీ పెళ్లి మాత్రం ఇంకా జరగలేదు. ఇంతకాలం పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకని చాలా వార్తలు వచ్చాయి. తనని పెళ్లి చేసుకోవడం ప్రభాకర్ కి ఇష్టమే కానీ వీళ్ళ పెళ్లి వాయిదా పడుతోంది. దానికి కారణం విజయకాంత్ పెళ్లి ముహూర్తం పెట్టుకోవడం. కరోనా రావడం వలన పెళ్లిని ఆపారు. కరోనా తగ్గి మళ్లీ ముహూర్తం పెట్టాలని అనుకున్నారు.
ప్రధాన నరేంద్ర మోడీని కూడా పెళ్లికి పిలవాలని భావించారట. విజయ కాంత్ మోడీకి వీలైనప్పుడే కొడుకు పెళ్లి చేయాలనుకున్నారు. విజయ కాంత్ మోడీ టైం కోసం వేచి చూసారట తర్వాత మోడీకి వీలు అయినా విజయ్ కాంత్ ఆరోగ్యం క్షిణించింది. ట్రీట్మెంట్ కోసం విజయ్ కాంత్ ని అమెరికా తీసుకెళ్లారు ఇలా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడేమో విజయకాంత్ చనిపోయారు ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది లోపు శుభకార్యం చేస్తే మంచిదంటారు మరి ఇప్పుడైనా తన పెళ్లి చేస్తారేమో చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!