ఉక్రెయిన్, రష్యా సమస్యతో ఇప్పుడు కొందరు బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా వైద్య విద్య కోసం గానూ… ఉక్రెయిన్ ఎక్కువగా వెళ్తున్నారు. అసలు ఎందుకు అక్కడి వరకు వెళ్తున్నారు…? మన దేశం నుంచి ప్రతీ ఏడాది… దాదాపు 20 వేల నుంచి 25 వేల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మన ప్రభుత్వం సేకరించిన డేటా ప్రకారం… చూస్తే… ఉక్రెయిన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో సుమారు 18,000 మంది మన విద్యార్ధులు ఉన్నారు.
Advertisement
అలాగే ఉక్రేనియన్ ప్రభుత్వం అంచనా ప్రకారం 2019లో దేశంలో 80,000 మంది అంతర్జాతీయ విద్యార్థులు చదువుతున్నారు. మన దేశంలో ఉన్న ప్రయివేట్ కళాశాల్లో మానేజ్మెంట్ కోటాలో మెడిసిన్ చదవడానికి తక్కువలో తక్కువ 50 లక్షల నుంచి కోటి 50 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. మన దేశంలో మొత్తం మెడికల్ సీట్లు… దాదాపు 83 వేలు కాగా… వీటిలో సగం మాత్రమే ప్రభుత్వ కాలేజీలు అందిస్తున్నాయి. 2021లో 16 లక్షల మంది విద్యార్థులు NEET-UG కి హాజరు కాగా ఒక్కో మెడికల్ సీటుకు దాదాపు 19 మంది పోటీ ఉంది అంటే ఏ స్థాయిలో వైద్య విద్యకు డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.
Advertisement
ఉక్రెయిన్ లో MBBS చదవడానికి 15–20 లక్షలు ఖర్చు మాత్రమే కాగా అక్కడ ఆరేళ్లు చదవాలి. మన దేశంలో నాలుగేళ్లు చదివితే సరిపోతుంది. MBBS డిగ్రీ కోసం విదేశాలకు వెళ్లే మన విద్యార్థులందరికీ మన దేశంలో ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందేందుకు తప్పనిసరిగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (FMGE) పరీక్ష రాయాలి. కానీ ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు FMGE 2021కి హాజరు అయ్యే అవసరం లేదు. FMGE కోసం హాజరయ్యే మెజారిటీ గ్రాడ్యుయేట్లు చైనా, రష్యా, ఉక్రెయిన్, కిర్గిజ్స్తాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో చదువుతున్నారు.