Home » ఈ విషయంలో ఉదయ్ కిరణ్ భార్య ఎందుకు మౌనంగా వుంటున్నారు..? కారణం ఏమిటి..?

ఈ విషయంలో ఉదయ్ కిరణ్ భార్య ఎందుకు మౌనంగా వుంటున్నారు..? కారణం ఏమిటి..?

by Sravya
Ad

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆయన ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, స్వయంకృషితో పైకి వచ్చారు కానీ అనుకోకుండా కొన్ని సందర్భాలు ఎదురవ్వడంతో, హఠాత్తుగా నిర్ణయం తీసుకుని, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన ఆయుష్షు ఉండగానే బలవంతంగా ప్రాణాలను తీసుకున్నారు ఉదయ్ కిరణ్. మనసంతా నువ్వే, చిత్రం, నువ్వు నేను వంటి సినిమాలతో స్టార్ హీరోగా పైకి వచ్చారు. స్టార్ హీరోలకి గట్టి పోటీని కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడం తగ్గిపోయాయి. పైగా అనుకోని కారణాల వలన ఆయన పెళ్లి కూడా ఆగిపోయింది.

Advertisement

Advertisement

తర్వాత ఉదయ్ కిరణ్ విషితని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళది లవ్ మ్యారేజ్. ఇది ఇలా ఉంటే ఆయనకి అవకాశాలు తగ్గిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని.. అదే అతన్ని బలవంతంగా ప్రాణాలను తీసుకునేలా చేసిందని అంతా చెబుతూ ఉంటారు. ఓ నాడు ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి మీడియా ముందుకి వచ్చి మాట్లాడడం జరిగింది. తన తమ్ముడు చనిపోవడానికి కారణం ఆర్థిక సమస్యలు కాదని ఆమె చెప్పారు. అంత కర్మ నా తమ్ముడికి లేదని.

అతనికి కావాల్సిన ఆస్తి ఉందని ఆమె చెప్పారు అతని భార్య మాత్రం మాకు దూరంగానే ఉంటుందని కలుపుకోవాలని ఎన్ని సార్లు చూసినా కలవలేదని చెప్పారు. ఉదయ్ కిరణ్ ఆస్తులని కూడా ఆమె తీసుకుందని శ్రీదేవి అన్నారు తనపై ఎన్ని నిందలు వేసిన ఆమె మౌనంగానే ఉన్నారు. ఎటువంటి విషయాలు కూడా చెప్పలేదు. మరి తన మనసుని పాడు చేసుకోవాలని ఇష్టం లేక మౌనంగా ఉన్నారో లేదంటే మరి ఏం జరిగిందో అయితే మనకి తెలియదు.

 

Visitors Are Also Reading