దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజమౌళి తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపించారు రాజమౌళి వరల్డ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు టాలీవుడ్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉందంటే అందుకు కారణం రాజమౌళి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.
Advertisement
రాజమౌళి వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి కొన్ని విషయాలపై సందేహం ఉంది. రాజమౌళి ఓ పెళ్లి అయ్యి కొడుకు ఉన్న ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలుసు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయిత, డైరెక్టర్. సంగీత దర్శకుడు కీరవాణి రాజమౌళి పెదనాన్న కొడుకు.
రాజమౌళికి అన్నయ్య అవుతాడు. రాజమౌళి వదిన శ్రీవల్లి చెప్పిన మాటలతో ఇండస్ట్రీలోకి వచ్చారు రాజమౌళి. శాంతినివాసం అనే సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ క్రమంలోనే రమతో పరిచయం ఏర్పడింది పెళ్ళై కొడుకు ఉన్న రమతో రాజమౌళి ప్రేమలో పడ్డారు కీరవాణి భార్య శ్రీవల్లి రమ సోదరి. రమకి పెళ్లయి కొడుకు ఉన్నాడు. కానీ భర్తతో ఆమె విడాకులు తీసుకున్నారు దాంతో రాజమౌళి ఆమెని పెళ్లి చేసుకున్నారు.
Advertisement
పెళ్లి తర్వాత కూడా కార్తికేయని తన సొంత కొడుకు కంటే ఎక్కువగా రాజమౌళి చూసుకుంటూ వచ్చారు. ఒకవేళ కనుక రాజమౌళి రమకి పిల్లలు పుడితే కార్తికేయని సరిగ్గా చూసుకోనేమో అన్న ఉద్దేశంతో రాజమౌళి రమతో సంతానాన్ని కూడా కోరుకోలేదు. ఒక ఆడపిల్లని దత్తత తీసుకొని పెంచుకుంటున్నాడు రాజమౌళి. రాజమౌళి పనిచేసే సినిమాలు అన్నిటికీ కూడా కుటుంబమంతా కలిసి పని చేస్తుంది. కీరవాణి భార్య వల్లి సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తారు రమ కాస్ట్యూమ్ డిజైనర్ గా, కొడుకు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తూ ఉంటారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!