Home » జట్టు నుండి కెఎల్ రాహుల్ ని ఎందుకు తప్పించేసారు..? కారణం ఏమిటి..?

జట్టు నుండి కెఎల్ రాహుల్ ని ఎందుకు తప్పించేసారు..? కారణం ఏమిటి..?

by Sravya
Ad

అఫ్ఘానిస్థాన్‌తో జనవరి 11 నుంచి మూడు మ్యాచుల టీ20 సిరీస్ జరగనుంది. అయితే అందులో ఆడదానికి భారత సెలక్షన్ కమిటీ ఆదివారం జట్టును ప్రకటించింది. ఇక ఆ వివరాల లోకి వెళితే.. 2022 టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ తర్వాత మళ్లీ టీ20 మ్యాచ్ ఆడని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఆడే ఛాన్స్ దొరికింది. జట్టులో చోటు ని వీళ్ళకి కల్పించారు. అయితే వీరిద్దరి తో పాటు చివరి మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్‌ను మాత్రం అఫ్ఘానిస్థాన్‌ తో టీ20 సిరీస్‌ కి సెలెక్ట్ చేయలేదు. కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయకపోవడం పై ఇండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేసారు.

Advertisement

ఇండియా టీం లో టీ20 ప్రపంచ కప్‌ లో టాప్-3 ప్లేయర్లలో ఒకరు రాహుల్ అని.. అతడి ని మాత్రం టీం నుండి తప్పించారని అన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ 2022 ప్రపంచకప్‌లో టాప్-3లో బ్యాటింగ్ చేశారు. వారిద్దరికీ జట్టులో చోటు కల్పించి రాహుల్‌ ని మాత్రం మరి ఎందుకు పక్కన పెట్టారు అని అన్నారు. ఈ విషయాలపై స్పష్టత అయితే లేదు. దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పారు.

Advertisement

రాహుల్ టెస్టులు, వన్డేల్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ కి వస్తున్నాడు అని అన్నారు. టీ20ల్లో మాత్రం ఓపెనర్‌గా బరిలోకొచ్చాడు. ప్రస్తుతం ఓపెనింగ్ లో రోహిత్ శర్మ అలానే శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్ పోటీ పడుతున్నారు. ఓపెనింగ్ ఖాళీగా లేదు అని, కోహ్లీ ఉండటంతో టాప్ ఆర్డర్‌లో లేదు అని వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మలను వున్నారు. మిడిల్ ఆర్డర్‌లో రింకూ సింగ్, శివమ్ దూబె వంటి హిట్టర్లను తీసుకున్నారు. ప్లేసుల సర్దుబాటు చేయలేక రాహుల్‌ను తప్పించినట్లు తెలుస్తోంది.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading