కేసీఆర్.. ఓటమి ఎరుగని రాజకీయ నాయకుడు. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ ధీరుడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము కోసం ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపిన ధీరుడిగా కేసీఆర్ చరిత్రలోకి ఎక్కారు. ఎన్నో పోరాటాలను చేసి.. ఎన్నో రాజకీయ పదవులను వదులుకున్న ఆయన జీవితంలో ఓటమి లేదని అందరు అనుకుంటూ ఉంటారు. అయితే.. రాజకీయ పరంగా ఆయన జీవితంలో కూడా ఓటమి ఉందన్న సంగతి అందరికీ తెలియదు.
Advertisement
ఎప్పుడు గెలవడమే తప్ప ఓడిపోవడం తెలియని కేసీఆర్ చరిత్రలో కూడా ఒక ఓటమి ఉందట. ఇంతకీ కేసీఆర్ ను ఓడించిన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. కేసీఆర్ పార్టిసిపేట్ చేసిన తొలి ఎన్నికల్లోనే ఆయన ఓటమి పాలయ్యారట. కేసీఆర్ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభించారు. ఆ తరువాత ఎన్టీఆర్ హవా గట్టిగా కొనసాగుతుండడంతో టీడీపీ పార్టీకి మారారు. ఆ సమయంలోనే 1983 లో సిద్ధిపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ మొట్ట మొదటిసారిగా పోటీ చేశారట.
Advertisement
అప్పటికే అనంతుల మదన్ మోహన్ రెడ్డి అనే రాజకీయ నాయకుడు సిద్ధిపేట నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఆయనకు పోటీగా టీడీపీ నుంచి కేసీఆర్ ను నిలబెట్టారట. ఇవే కేసీఆర్ కు మొట్టమొదటి ఎన్నికలు. అప్పటికే సిద్దిపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనంతుల మదన్ మోహన్ రెడ్డి సీనియర్ లీడర్ గా ఉన్నారు. ఆయన చేతిలో కేసీఆర్ ఓడిపోయారు. మొదటిసారి ఓడిపోవడంతో కేసీఆర్ కన్నీరు మున్నీరయ్యారట. ఆయనకు ఇవే మొదటి ఎన్నికలు కావడంతో ఎన్టీఆర్ ప్రచారానికి వస్తానని మాటిచ్చారట. కానీ.. ఊపిరి సలపని పనులు ఉండడంతో ఎన్టీఆర్ కు హాజరు కావడానికి వీలు పడలేదు. దీనితో ఆయన ప్రచారానికి రాకుండానే ఎన్నికల్లో పోటీ చెయ్యాల్సి వచ్చింది. ఓడిపోవడంతో కేసీఆర్ డీలా పడిపోయారట. అసలు కార్యకర్తలని కూడా కొన్ని రోజులు కలవలేదట. దీనితో ఎన్టీఆర్ ఓ సారి కేసీఆర్ ను కలిసి ధైర్యం చెప్పి.. జ్ఞానబోధ చేశారట. దీనితో కేసీఆర్ తిరిగి ఉత్సాహం పుంజుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అదే ఊపుతో దూసుకెళ్లారు. ఆ తరువాత ఆయన వెనుదిరిగి చూడలేదు. మళ్ళీ ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!