ICC : ప్రపంచకప్ లో డిజాస్టర్ పర్ఫామెన్స్ ఇచ్చిన శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. బోర్డులో అవినీతి సరిగ్గా పనిచేయడం లేదంటూ ఇప్పటికే ఆదేశ ప్రభుత్వం లంక క్రికెట్ బోర్డును రద్దు చేసింది. అయితే ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ లంక సభ్యత్వంపై ఐసీసీ సస్పెన్షన్ విధించింది. తాత్కాలిక నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పింది.
శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేయాలన్న తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంట్ గురువారం ఆమోదించింది. దీంతో అత్యవసరంగా సమావేశమైన ఐసీసీ లంక సభ్యత్వంపై నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ ఎత్తేసే వరకు వరకు ఐసిసి టోర్నీల్లో పాల్గొనే అవకాశం లేదు. ఆఖరి 4 ఏళ్లలో శాశ్వత సభ్యదేశంపై ఐసీసీ సస్పెన్షన్ విధించడం ఇది రెండోసారి. 2021లో ప్రభుత్వ జోక్యం కారణంగా జింబాబ్వే వేటుకు గురైంది. జింబాబ్వే అంటే చాలా చిన్న టీం.
Advertisement
Advertisement
కానీ అప్పట్లో స్ట్రాంగ్ గా ఉన్న శ్రీలంకకు ఇదే పరిస్థితి ఎదురు కావడం చాలా బాధాకరం అని చెప్పాలి. అయితే.. బీసీసీఐని కూడా రద్దు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. అమిత్ షా కొడుకు కూడా బీసీసీఐ లో బాగా వేలు పెడుతున్నాడని… వెంటనే బీసీసీఐని కూడా రద్దు చేయాలని ఇండియాలోని ప్రతి పక్షాల నుంచి డిమాండ్ వస్తోంది. మరి దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.