పాలు ఆరోగ్యానికి మంచిది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలు తాగడానికి కొందరు ఇష్టపడితే మరికొందరు చిరాకు పడుతూ ఉంటారు. ఇక పాల విషయంలో సందేహాలు చాలానే ఉన్నాయి. పాలు ఎందుకు కాచిన తర్వాత తాగాలి, వేడి చేయకుండా తాగితే ఏమవుతుంది అనే అనుమానాలు ఉన్నాయి. అయితే పాలు వేడి చేయకుండా తాగితే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
Advertisement
గేదెల లేదా ఆవుల వద్ద తీసిన పాలలో ఒకరకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కచ్చితంగా మంచిది కాదు కాబట్టి కాచి తాగాల్సిన అవసరం ఉంది. గేదె దగ్గర పొదుగు పాలు కాబట్టి దాన్ని శుభ్రం చేయడానికి అవకాశం లేదు. ఇక ఏ నీళ్ల పడితే ఆ నీళ్లతో కడుగుతారు కాబట్టి కాచి తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇక ఆ పాలను తీసుకువచ్చి మనకు పోసే వాళ్ళలో నిజాయితీ ఎక్కువ.
Advertisement
ఏ నీళ్ళు పోస్తాడో మనకు తెలియదు కాబట్టి పచ్చి పాలు తాగకుండా ఉండటం చాలా ఉత్తమం. పచ్చి పాలు తాగితే అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవది ప్యాకెట్ పాలు ఈ మధ్య ఎక్కువగా అమ్ముతున్నారు అందరూ తాగుతున్నారు. అందులో పౌడర్ కలిపి పాలు కింద తయారు చేస్తున్నారు. కావున ఆ పాలను డైరెక్ట్ గా తాగడం కంటే కూడా కాస్త మరిగించి తాగితే ఎవరికి ఏ సమస్య ఉండదు.