Home » హెల్త్ బాగోలేదని చెకప్ కి వెళ్ళినప్పుడు డాక్టర్ నాలుక చూపించమని ఎందుకు అడుగుతారు?

హెల్త్ బాగోలేదని చెకప్ కి వెళ్ళినప్పుడు డాక్టర్ నాలుక చూపించమని ఎందుకు అడుగుతారు?

by Srilakshmi Bharathi
Ad

ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు అంటారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా తక్షణమే చర్య తీసుకోవాలి. చిన్న చిన్న వాటికి ఇంటి చిట్కాలతో నయం చేసుకోవడానికి అయినా ప్రయత్నించాలి. ఒకవేళ నయం కాకపోతే ఆసుపత్రికి అయినా వెళ్ళాలి. అయితే.. మీరెప్పుడైనా గమనించారా? మనకి ఏదైనా జ్వరం వచ్చినా, లేదా ఏ ఆరోగ్య సమస్య అయినా చెకప్ కి వెళ్ళినప్పుడు డాక్టర్ ముందుగా నాలుక చూపించమని అడుగుతారు. ఇలా ఎందుకు అడుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

toung 1

Advertisement

శరీరంలో ఏ చిన్న అనారోగ్యం చేసినా ఆ ప్రభావం నాలుకపై పడుతుంది. ఫలితంగా నాలుక రంగు మారుతుంది. నాలుకలో మార్పులని బట్టి డాక్టర్లు మన రోగ లక్షణాలను, రోగం ప్రభావాన్ని అంచనా వేస్తారు. ఇది సామాన్యులకు అర్ధం కాకపోయినా డాక్టర్స్ కు అర్ధం అవుతుంది. నాలుకపై తెల్లటి పూత, పసుపు రంగులోకి మారడం, నాలుకపై శ్లేష్మం, కఫము ఏర్పడడం, ఒక్కోసారి నాలుక నలుపు, గోధుమ రంగులోకి మారడం కూడా జరుగుతుంది.

Advertisement

toung

నాలుక విషయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. తగిన చికిత్స తీసుకోవాలి. లేకుంటే మధుమేహం నుంచి హై బిపి వరకు వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. నాలుకని శుభ్రం చేసుకోవడం వలన తినే మార్గం బాగుండి ఏ ఇతర రోగాలు రాకుండా ఉంటాయి. శరీరంలోని మురికిని పోగొట్టుకోవడానికి ప్రతి రోజు డిటాక్స్ డ్రింక్ తాగితే మంచిది. ఒక గ్లాస్ వాటర్ లో నిమ్మకాయ, పసుపు, జీలకర్ర, అల్లం వేసి మరిగిస్తే డీటాక్స్ డ్రింక్ రెడీ అవుతుంది.

మరిన్ని ముఖ్య వార్తలు:

HEALTH TIPS TELUGU: అధిక డీహైడ్రేషనా.. అయితే ఇవి తినాల్సిందే..!!

HEALTH TIPS : రాత్రిపూట పొరపాటున కూడా వీటిని తినవద్దు..!

Visitors Are Also Reading