మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి చిరు వచ్చారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి చాలా మందిని హీరోలుగా చేశారు. సామాన్యుడు కూడా హీరో అవ్వచ్చని చిరంజీవి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి వయసు 70 సంవత్సరాలకి దగ్గరగా వున్నా కూడా ఆయన వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి పోటీగానే ఉంటున్నారు.
Advertisement
చిరంజీవి తమిళంలో సినిమాలు చేయడానికి కానీ అతను సినిమాలు తమిళ్లో డబ్బింగ్ చేయడానికి కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదని కమల్ హాసన్ చెప్పడం జరిగింది. అందువల్లే ఆయన తెలుగుకి మాత్రమే పరిమితం అయిపోయారు. లేదంటే చిరు టాలెంట్ కి తమిళ్ లో కూడా మెగాస్టార్ గా ఎదిగేవారని చిరంజీవి గురించి కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి కమల్ హాసన్ చెప్పింది కూడా నిజమే.
Advertisement
చిరంజీవికి ఉన్న టాలెంట్ కి తమిళ్ ప్రేక్షకులు కూడా చిరంజీవిని చూస్తారు చిరంజీవి వాళ్ళని కూడా మెప్పించగలరు. కానీ అతను ఆ రకంగా చేయలేదు. దానికి కారణం ఒక తెలుగులో మాత్రమే మనం స్టార్ గా కొనసాగితే సరిపోతుంది, తెలియని ఇండస్ట్రీకి వెళ్లి మనం ఇబ్బందులు పడే కంటే తెలిసిన ఇండస్ట్రీలోనే సినిమాలు చేసే ప్రేక్షకుల్ని మెప్పిస్తే చాలు అని చిరు ఉండేవారని, అందుకే తెలుగులోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లారని కమల్ హాసన్ అన్నారు ఒకవేళ కనుక అక్కడ కూడా ఆ చిరు నటించి ఉంటే పాపులర్ అయిపోయి ఉండేవారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!