మీరెప్పుడైనా గమనించారా? సాధారణంగా పండ్లన్నీ గుండ్రంగానే ఉంటాయి. ద్రాక్ష, యాపిల్, ఆరంజ్ వంటి పండ్లన్నీ గుండ్రంగానే ఉంటాయి. కానీ సైజు లలో తేడా ఉంటుంది. చివరకు పనస కూడా గుండ్రమే. కాకపోతే కొద్దిగా ఓవల్ షేప్ లేదా సైజు వేరుగా ఉంటుంది. కానీ అరటిపండు మాత్రం వంకరగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా?
Advertisement
అరటిపండ్లు సాధారణంగా చెట్లపైనే పెరుగుతాయి. ముందుగా పూలు వచ్చి.. ఈ పూల అంచునుంచి అరటి పిందా రావడం మొదలవుతుంది. ఇది పెరిగి కాయగా మారుతుంది. మొదట ఇది స్ట్రెయిట్ గానే ఉన్నా కాయ సైజు పెరుగుతున్న కొద్దీ వంకర ఏర్పడడం మొదలవుతుంది. నిజానికి అరటి ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. ఈ ఆకుల కింద పండే అరటి పండ్లకు సూర్యరశ్మి సరిగ్గా పడే అవకాశం ఉండదు. అందుకే ఇవి పైకి పెరుగుతూ ఉంటాయి. సూర్యుని వైపుకు తిరిగి పెరుగుతాయి.
Advertisement
నిజానికి ఏ పండ్లు అయినా చెట్టుకి కాసిన తరువాత వాటికీ నెగెటివ్ జియోట్రోపిజం అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో అవి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి ఆకర్షించబడతాయి. కానీ అరటి పండ్ల విషయంలో మాత్రం ఇలా జరగదు. అవి సూర్యుడు ఎటువైపు పడుతుంటే అటు వైపుకు తిరిగి పెరుగుతుంటాయి. అందుకే అరటి పండ్లు వంకరగా ఉంటాయి. సూర్య కాంతి కోసమే అరటికాయలు పై వైపుకు చూస్తూ పెరుగుతుండడం వలన వంకర ఏర్పడుతుంది.
Sanju Samson : బాబు కెరీర్ క్లోజ్.. ఇక ఐపీఎల్ ఆడుకో !
Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో
హీరోయిన్ శోభన పెళ్లికి దూరమవ్వడానికి ఆ స్టార్ హీరోనే కారణమయా…!