ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఒకప్పుడు సీనియర్ హీరోలు వీళ్ళు. ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు అక్కినేని, ఎన్టీఆర్.
Advertisement
ఇద్దరు కూడా మంచి స్నేహితులు. రాజకీయాల్లోకి వెళ్దాం అని ఎన్టీఆర్ చెప్పినా అక్కినేని కి ఆసక్తి లేకపోవడంతో ఎన్టీఆర్ ఒంటరిగానే తెలుగుదేశం పార్టీని మొదలుపెట్టారు 9 నెలల్లోనే సీఎం అయిపోయారు. రాజకీయాల్లోకి అక్కినేని రమ్మని చాలాసార్లు చెప్పారు. కానీ అక్కినేని మాత్రం వెళ్లలేదు ఎన్టీఆర్ కి ఈ విషయం ఎప్పుడు మనసులో ఉండేది ఒకసారి రవీంద్ర భారతిలో ఏదో ఒక ప్రోగ్రాం లో ఉపన్యాసం ఇస్తూ కాషాయం కట్టుకున్న వారు ఎవరు సన్యాసులు కారు అని ఏదో ఫ్లోలో చెప్పేసారు.
అప్పటికే ఎన్టీఆర్ సంసార జీవితాన్ని వదులుకొని ఆస్తులని కొడుకులకి పంచేసి, కాషాయ వస్త్రాలను ధరించారు అయితే రవీంద్ర భారతిలో ఉపన్యాసం జరుగుతున్న టైంలో విన్నవారెవరో ఎన్టీఆర్కి తప్పుగా మోసారు. ఎన్టీఆర్ ని ఉద్దేశించి అక్కినేని ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పడంతో ఎన్టీఆర్ నమ్మారు. దాంతో ఎన్టీఆర్ కి అక్కినేని పై చాలా కోపం వచ్చిందట ఇప్పటినుండి రవీంద్ర భారతి అక్కినేని ఎలాంటి స్పీచ్ ఇచ్చిన ఆ టేపు తనకి పంపించాలని ఎన్టీఆర్ సీఎం హోదాలో ఆర్డర్ వేయడం జరిగింది. ఈ విషయం అక్కినేనికి కూడా తెలిసిపోయింది ఆ ఉద్దేశంతో తాను అనలేదని కాబట్టి ఆ వ్యాఖ్యలని అంత సీరియస్ గా తీసుకోలేదు.
Advertisement
అక్కినేని అయితే ఎన్టీఆర్ కి మాత్రం అప్పటినుండి కూడా కోపం అలా పెరుగుతూ వచ్చిందట. ఆ విషయాన్ని ఎన్టీఆర్ తనని అడిగి విషయాన్ని సాల్వ్ చేసుకుని ఉండి ఉంటే బాగుండేది అని అక్కినేని అనుకున్నారు కానీ అలా జరగలేదు అప్పటినుండి మూడేళ్ల వరకు రవీంద్రభారతిలో అడుగు కూడా నాగేశ్వరరావు పెట్టలేదు. రెండోసారి ఎన్టీఆర్ సీఎం అయ్యాక కూడా అక్కినేని ఎన్టీఆర్ ఆహ్వానించిన ఏదో మొక్కుబడిగా ఆయన వెళ్లారు. బయట ఫంక్షన్స్ లో కలిసిన ఎడమొహంగానే ఉండేవారట. దాని ద్వారా దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియో పైన కొన్ని కేసులు కూడా నమోదు చేయించారు. ఎన్టీఆర్ కొన్నాళ్ళకి ఎన్టీఆర్ అక్కినేని ఇంటికి పిలిపించుకుని సారీ చెప్పారు అప్పటికి ఇలా సమస్య పరిష్కారం అయ్యింది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!