ఎవరు ఎన్ని చెప్పినా సరే తెలుగు సినిమా మొత్తం కూడా కమర్షియల్ అనే ఫార్ములా మీదనే నడుస్తుంది అనడంలో సందేహం లేదు. సినిమా ఎలా ఉన్నా సరే స్టార్ హీరో సినిమా కాబట్టి సూపర్ హిట్ అనేస్తూ ఉంటారు. ఎంత ప్రచారం చేస్తే అంతగా ఆ సినిమా హిట్ అయినట్టు. అందులో ఏ సోది ఉన్నా సరే జనాలు ఎగబడి చూస్తూ ఉంటారు. ఆ విధంగా మేటర్ లేకుండా చాలా సినిమాలు హిట్ అయ్యాయి.
Advertisement
Advertisement
ఇక హీరోల పారితోషికం కూడా చాలా బాగా పెరిగింది. తెలుగు సినిమా హీరోల లో ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో ఎవరు? అనేది ఒకసారి చూస్తే… ఈ పోటీ ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్ ల మధ్యనే జరుగుతోంది అని టాక్ నడుస్తుంది. ఒక్కొక్కరి సినిమా సాధించిన విజయం రేంజి, బాక్స్ ఆఫీసు కలెక్షన్లు బట్టి అటూ ఇటూ మారుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.
బాహుబలికి వచ్చిన అంతర్జాతీయ గుర్తింపుతో ప్రభాస్ లెవెల్ బాగా పెరిగింది అనే మాట వాస్తవం. పాన్ ఇండియా మూవీస్ నిర్మాణం ఊపు అందుకొన్నది కూడా అక్కడి నుంచే. ఆ తరవాత నుంచి ప్రభాస్ కు జంటర్నేషనల్ గా గుర్తింపు, క్రేజ్ రావడం వలన భారీ పెట్టుబడులు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు ప్రభాస్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారట. ప్రభాస్ ప్రస్తుతం 80 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు అని టాక్ నడుస్తుంది.