Home » కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షికి ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షికి ఇష్టమైన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?

by Mounika

కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరి కంటే ధోనీ ని ఇంకా ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఆయన భార్య సాక్షి ధోనీ. అయితే కోట్లాది మంది అభిమానులకు హీరో ధోనీ.  అలాంటి ధోనీని అభిమానించే సాక్షికి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?

క్రికెట్‌కు విరామం ఇచ్చిన ధోని ఇప్పుడు వినోద రంగంలోకి అడుగుపెట్టాడు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్‌జిఎం అనే తమిళ చిత్రాన్ని కూడా నిర్మించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఆ ప్రమోషన్స్‌లో సాక్షి ధోనీ కూడా పాల్గొంటున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో సాక్షి ధోనీ సౌత్ సినిమాలు చూస్తారా.. అని ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది.

సాక్షి తనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు అంటే చాలా ఇష్టమని, అల్లు అర్జన్ కి ఆమె వీరాభిమాని అంటూ చెప్పడం జరిగింది. ప్రస్తుతం సాక్షి చెప్పిన ఆ విషయం కాస్త వైరల్‌గా మారింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ మరియు OTT ఉన్నాయి. ఇంతకు ముందు సౌత్ సినిమాలను గోల్డ్ మైన్స్ ద్వారా హిందీలోకి డబ్ చేసేవారు.  అల్లు అర్జున్ సినిమాలన్నీ చూశాను. నేను అల్లు అర్జున్‌కి వీరాభిమానిని అని సాక్షి ధోనీ తెలిపింది.

అంతేకాకుండా హిందీలో విడుదలయ్యే సౌత్ సినిమాలను కూడా బాగా చూస్తానని చెప్పారు సాక్షి. ఎంఎస్ ధోనీకి తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఎల్‌జీఎం సినిమాను తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. త్వరలో మరిన్ని చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రెస్ మీట్ సందర్భంగా తెలిపారు. అంతేకాదు టాలీవుడ్ లోనూ కచ్చితంగా సినిమాలు చేస్తానని పరోక్షంగా హింట్ కూడా ఇచ్చారు.

 సాక్షి ధోని వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక తెలుగు హీరో బాలీవుడ్‌లో ఇంత క్రేజ్ సంపాదించుకోవడం అంత ఈజీ కాదని కొందరు అంటున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ అభిమానులకు ఇది పెద్ద సర్ ప్రైజ్ అనే చెప్పాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు  :

ఉపాసనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్..! ఇంతకీ ఏం జరిగిందంటే..!

మగధీర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

అప్పటిలో సావిత్రిని ఏఎన్ఆర్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా..?

 

Visitors Are Also Reading