Home » ఏటీఎమ్‌లో చిరిగిన నోట్లు వచ్చినట్లయితే… ఏం చెయ్యాలి..?

ఏటీఎమ్‌లో చిరిగిన నోట్లు వచ్చినట్లయితే… ఏం చెయ్యాలి..?

by Sravya
Ad

మనం దేనినైనా కొనుగోలు చేయాలంటే, కచ్చితంగా డబ్బులు ఉండాలి. ఇదివరకు ఏటీఎంలు మనకి బాగా హెల్ప్ అయ్యేవి. డబ్బులు లేని సమయంలో ఈజీగా ఏటీఎం కి వెళ్లి మనం డబ్బులు తీసుకునే వాళ్ళం ఈరోజుల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోవడంతో ఏటీఎంల వాడకం కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఏటీఎంలో విస్తృతంగా అందుబాటులోకి రావడంతో డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఎంతో ఈజీ అయిపోయింది. అయితే టీంలో డబ్బులు తీసుకుంటున్నప్పుడు చిరిగిన నోట్లు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఈ సమస్యని మీరు కూడా ఎప్పుడైనా ఎదుర్కొనే ఉంటారు.

Advertisement

ఒకవేళ కనుక ఏటీఎం నుండి చిరిగిపోయిన నోట్లో వస్తే మనం వాటిని ఏం చేయాలి..? బ్యాంక్ నియమాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఏటీఎంల నుండి చిరిగిన నోట్లు వస్తే భయపడక్కర్లేదు. ఎందుకంటే చిరిగిన నోట్లను మనం బ్యాంకులో మార్చుకోవచ్చు ఈ నోట్లని సులభంగా భర్తీ చేసుకోవచ్చు. ఏటీఎంలో వచ్చిన చిరిగిన నోట్లను మార్చుకోవడానికి బ్యాంకు నిరాకరించకూడదు అని ఆర్బీఐ చెప్పింది.

Advertisement

కేవలం బ్యాంకుకు వెళ్లి నిమిషాల్లోనే మనం చిరిగిపోయిన నోట్లనే మార్చుకొని రావచ్చు. చిరిగిన నోట్లు వచ్చిన ఏటీఎం లింక్ చేసిన బ్యాంకులో మీరు సంప్రదించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకుకు వెళ్లి అప్లికేషన్ ఇవ్వాలి డబ్బు విత్ డ్రా చేసిన తేదీ, సమయం, ఏటీఎం పేరుని రాయాలి. దీంతో పాటు ఏటీఎం ట్రాన్సాక్షన్ తర్వాత వచ్చే స్లిప్ ని అప్లికేషన్ కి జత చేయాల్సి ఉంటుంది మొబైల్ కి వచ్చిన మెసేజ్ ని చూపించినా కూడా చాలు. బ్యాంకులు కూడా ఏటీఎంలో చిరిగిపోయిన నోట్లు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading