మనకి గుండెలో నొప్పి రావడానికి, పానిక్ అటాక్ కి తేడా గుర్తించడం కొన్నిసార్లు కష్టం అవుతుంది. ఛాతీలో నొప్పి వస్తే గుండె పోటు అనే అనుకుంటూ ఉంటాం. కానీ అది పానిక్ అటాక్ కూడా అయ్యి ఉండవచ్చు. ఛాతీ నొప్పి. శ్వాస ఆడకపోవుట, ఆకస్మిక మైకము, చలికి చెమట వంటి లక్షణాలు కనిపిస్తే దానిని మనం గుండెపోటుగా భావించాలి. ఇవి గుండెపోటుకు సంబంధించిన అన్ని సంకేతాలు నిజమే అయినప్పటికీ, అవి చాలా తక్కువ ప్రాణాంతకమైన లక్షణాలుగా చెప్పుకోవచ్చు.
Advertisement
గుండెలోని ధమని మూసుకుపోతే తగినంత రక్తం, ఆక్సిజన్ గుండెలోని ఏ భాగానికి చేరకుండా ఉండిపోతుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని తీవ్రమైన పరిస్థితిగా భావించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తలతిరగడం, అపస్మారక స్థితి, వేగవంతమైన గుండెచప్పుడు వంటి లక్షణాలు కనిపిస్తే దానిని గుండెపోటుగా భావించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఈ లక్షణాలతో పాటు వాంతులు, వికారం, ఊపిరి ఆడకపోవడం, శరీరంలో నొప్పి వంటి లక్షణాలు కూడా ఉండొచ్చు.
Advertisement
పానిక్ అటాక్ విషయానికి వస్తే తీవ్ర ఒత్తిడి, ఆలోచన, ఆందోళన వలన వస్తుంది. ఇది ప్రాణాంతకం కాదు. కానీ, మానసిక ఆరోగ్యానికి చేటు తెస్తుంది. ఛాతీ నొప్పితో పాటు చెమట, శ్వాస ఆడకపోవుట, తల తిరగడం, వాంతులు లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ రెండిటికి ఒకేలాంటి లక్షణాలు ఉంటాయి. మరి తేడాని గుర్తించడం ఎలా? గుండెపోటు వచ్చినప్పుడు ఆ నొప్పి చేతులు, దవడ, మెడ వైపుకు కూడా పాకుతూ ఉంటుంది. కానీ, పానిక్ అటాక్ లో నొప్పి ఛాతీకి మాత్రమే పరిమితం అవుతుంది. ఈ చిన్న తేడాని గుర్తించాలి. పానిక్ ఎటాక్ వచ్చినప్పటి కంటే, గుండెపోటు వచ్చినపుడు గుండె చప్పుడు వేగం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రెండు పరిస్థితులకు ఎక్కువ ఒత్తిడికి లోనవ్వడం కారణంగా ఉంది.
మరిన్ని..
జాని మూవీ ఫ్లాప్ తరువాత పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటో తెలుసా ?
రజనీకాంత్ తన కూతురి కోసమే… ఈ డైలాగ్ ని జైలర్ లో పెట్టారా..?